News November 19, 2024

రేప‌టి నుంచి Bank Niftyలో అవి క‌నిపించ‌వు

image

రేపటి నుంచి Bank Niftyలో వీక్లీ డెరివేటివ్స్ కనిపించవు. ఈ ఇండెక్స్‌ Volatilityపై అవగాహన లేని రిటైల్ ట్రేడర్లు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీంతో ఇక నుంచి ఒక ఇండెక్స్‌లోనే వీక్లీ డెరివేటివ్‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఎక్స్‌ఛేంజ్‌లను SEBI ఆదేశించింది. దీంతో Nifty వీక్లీ F&Oను అలాగే ఉంచి Bank Nifty వీక్లీ ఆప్షన్స్‌ను తొలగించాలని NSE నిర్ణయించింది. ఈ ఇండెక్స్‌లో Monthly Derivatives మాత్ర‌మే ఉంటాయి.

Similar News

News December 12, 2024

బ్రిస్బేన్‌ హోటల్‌లో కోహ్లీ-అనుష్క!

image

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట తమ ఏడో వివాహ వార్షికోత్సవాన్ని ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ హోటల్‌లో జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటో వైరలవుతోంది. ప్రస్తుతం కోహ్లీ BGT కోసం జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు చేరుకోగా మూడో టెస్టు కోసం సన్నద్ధం అవుతున్నారు. వెడ్డింగ్ డే కావడంతో టీమ్‌కు దూరంగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశారు. 2017 డిసెంబర్ 11న వీరిద్దరి ప్రేమ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

News December 12, 2024

భార్యాబాధితుడి సూసైడ్: చచ్చిపోవాలని భార్య తిడితే నవ్విన జడ్జి!

image

మనోవర్తి చెల్లించలేక, భార్య క్రూరత్వాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్న అతుల్ సుభాష్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ‘పిల్లాడి బాగోగుల కోసం మొదట నెలకు రూ.40వేలు అడిగారు. తర్వాత రూ.80వేలు, లక్షకు పెంచారు. చిన్న పిల్లాడికి ఎంత ఖర్చవుతుందని అతుల్ ప్రశ్నించారు. డబ్బు చెల్లించకుంటే సూసైడ్ చేసుకోవాలని భార్య అతడి మొహంపైనే అనేయడంతో జడ్జి నవ్వారు. ఇదెంతో బాధించింది’ అని అతుల్ అంకుల్ పవన్ ఆరోపించారు.

News December 12, 2024

హిందూ సాధువు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన బంగ్లాదేశ్ కోర్టు

image

హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ విచారణ తేదీని ముందుకు జరిపేందుకు బంగ్లాదేశ్ హైకోర్టు తిరస్కరించింది. అభ్యర్థించిన లాయర్ రబీంద్ర ఘోష్‌కు ఆథరైజేషన్ పవర్ లేదని పేర్కొంది. ఇస్లామిస్టుల దాడితో కృష్ణ‌దాస్ లాయర్ ఆస్పత్రి పాలవ్వడం తెలిసిందే. దీంతో ఆయన కోసం పోరాడేందుకు ఘోష్ వచ్చారు. ‘విచారణ తేదీపై పిటిషన్ వేయగానే 30 మంది లాయర్లు నన్ను చుట్టుముట్టి దాడికి ప్రయత్నించారు’ అని ఆయన తెలిపారు.