News November 30, 2024

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల కృష్ణారెడ్డి

image

TG: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. కాగా ఆయనకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.

Similar News

News December 12, 2024

కాబూల్‌లో భారీ పేలుడు.. 12 మంది మృతి

image

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. శరణార్థుల మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద జరిగిన పేలుడులో మంత్రి ఖలీల్ రహ్మాన్ హక్కానీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతనితో సహా 12 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇది ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నారు. అనుమానితుడి ఫొటోను తాలిబన్ మీడియా రిలీజ్ చేసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

News December 12, 2024

పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన APPSC

image

AP: పలు పోటీ పరీక్షల తేదీలను APPSC ప్రకటించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షలను మార్చి 16వ తేదీ ఉదయం 9.30 నుంచి మ.12 వరకు నిర్వహించనుంది. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ మెయిన్ పరీక్షలను మార్చి 17వ తేదీన ఉదయం 9.30 నుంచి 12 వరకు, మ.2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. షెడ్యూల్ కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News December 12, 2024

జమిలి ఎన్నికలకు డ్రాఫ్ట్ బిల్లు రెడీ.. రేపు క్యాబినెట్ ముందుకు?

image

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పలు చట్ట సవరణలు చేయాల్సి ఉండడంతో ఆ మేరకు ముసాయిదా బిల్లును న్యాయ శాఖ రూపొందించినట్టు సమాచారం. ఈవారమే బిల్లు పార్లమెంటు ముందుకు రావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.