News November 16, 2024
టీ20ల్లో మూడో ఫాస్టెస్ట్ 200 స్కోర్

సౌతాఫ్రికాతో చివరి మ్యాచ్లో భారత్ రికార్డ్ సృష్టించింది. టీ20 చరిత్రలో మూడో ఫాస్టెస్ట్ 200 స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ 14.1 ఓవర్లలోనే 200 రన్స్ చేసింది. ఈ ఏడాది HYDలో బంగ్లాతో జరిగిన మ్యాచ్లో IND 13.6 ఓవర్లలో ఈ ఘనత సాధించింది. అయితే 13.5 ఓవర్లలోనే వెస్టిండీస్పై సౌతాఫ్రికా ఫాస్టెస్ట్ 200 రన్స్ చేసి తొలి స్థానంలో ఉంది.
Similar News
News November 14, 2025
తెలంగాణ రౌండప్

* ఈ నెల 17 నుంచి 22 వరకు సర్కారు స్కూళ్లను తనిఖీ చేయనున్న ఉన్నతాధికారులు.. సేఫ్ అండ్ క్లీన్, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించనున్న స్పెషల్ అధికారులు
* చిన్న చిన్న కారణాలతో 2021 నుంచి తొలగించిన 1,300 మంది ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఎండీ నాగిరెడ్డికి కవిత వినతి
* సమ్మె కారణంగా వాయిదా పడిన ఫార్మసీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకారం..
News November 14, 2025
ఆలు లేత, నారు ముదర అవ్వాలి

ఈ సామెతలో ఆలు అంటే తమలపాకు. అది ఎంత లేతగా ఉంటే అంత రుచిగా, మృదువుగా ఉంటుంది. అలాగే మనిషి కూడా కొన్ని(స్వభావం, మాటతీరు) విషయాల్లో మృదువుగా, సున్నితంగా ఉండాలి. ఇక్కడ నారు అంటే వరి నారు, మొక్కల నారు. అది నాటే సమయానికి ముదురుగా ఉంటేనే మంచి పంట వస్తుంది. అలాగే మనిషి కూడా కొన్ని విషయాల్లో (విలువలు, నిర్ణయాలు, పట్టుదల) దృఢంగా, స్థిరంగా ఉంటే మంచిదని ఈ సామెత అర్థం.
News November 14, 2025
SAvsIND: ఈ‘డెన్’ మనదేనా?

కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాతో నేటి నుంచి టీమ్ఇండియా తొలి టెస్టు ఆడనుంది. ఈడెన్లో 42 మ్యాచులు ఆడిన భారత్ 13 గెలిచి, 9 ఓడగా మరో 20 మ్యాచులు డ్రాగా ముగిశాయి. చివరగా 2019లో BANతో జరిగిన టెస్టులో భారత్ గెలిచింది. అయితే ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ SAను తక్కువ అంచనా వేయొద్దని గిల్ సేన భావిస్తోంది. 9.30AMకు మ్యాచ్ మొదలుకానుంది. స్టార్ స్పోర్ట్స్, జియోహాట్ స్టార్లో లైవ్ చూడవచ్చు.


