News January 28, 2025
టీమ్ ఇండియాతో మూడో టీ20.. ఇంగ్లండ్ జట్టు ఇదే

టీమ్ ఇండియాతో జరగబోయే మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. రెండో టీ20లో ఆడిన జట్టునే ఈ మ్యాచుకు కూడా కొనసాగిస్తోంది. జట్టు: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్ (), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. మూడో టీ20 ఇవాళ రాజ్ కోట్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.
Similar News
News January 24, 2026
చెలరేగిన భారత బౌలర్లు.. NZ 135 రన్స్‌కే ఆలౌట్

U19 మెన్స్ వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచులో న్యూజిలాండ్ 135 పరుగులకే ఆలౌటైంది. వర్షం కారణంగా 37 ఓవర్లకు మ్యాచ్ కుదించగా టీమ్ ఇండియా బౌలర్లు విజృంభించడంతో ఓ దశలో 22 పరుగులకే NZ సగం వికెట్లు కోల్పోయింది. శాంసన్(37*), సంజయ్(28), కటర్(23) ఫర్వాలేదనిపిండంతో జట్టు స్కోరు 100 దాటింది. భారత బౌలర్లలో అంబరీశ్ 4, హెనిల్ 3, ఖిలాన్, మహ్మద్, కనిష్క్ తలో వికెట్ తీశారు. టీమ్ ఇండియా టార్గెట్ 136.
News January 24, 2026
ఎల్లుండి విజయ్-రష్మిక కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్

రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా VD14 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈ నెల 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 1854-1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్-రష్మిక చేస్తున్న మూడో సినిమా కావడం విశేషం. త్వరలో వీరు పెళ్లి చేసుకోనున్నట్లూ ప్రచారం జరుగుతోంది.
News January 24, 2026
యాత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,979 పోస్టులు

యాత్ర ఇండియా లిమిటెడ్ 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ, టెన్త్ అర్హత గలవారు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అర్హత గలవారికి నెలకు రూ.8200, ఐటీఐ అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్సైట్: https://recruit-gov.com/


