News January 28, 2025
టీమ్ ఇండియాతో మూడో టీ20.. ఇంగ్లండ్ జట్టు ఇదే

టీమ్ ఇండియాతో జరగబోయే మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. రెండో టీ20లో ఆడిన జట్టునే ఈ మ్యాచుకు కూడా కొనసాగిస్తోంది. జట్టు: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్ (), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. మూడో టీ20 ఇవాళ రాజ్ కోట్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.
Similar News
News February 13, 2025
కాలేజీ విద్యార్థులకు అపార్ ఐడీలు

TG: కాలేజీ విద్యార్థులకు 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(అపార్) IDలను ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కేంద్రం ఆదేశాల మేరకు వన్ నేషన్-వన్ స్టూడెంట్ ID ప్రోగ్రామ్ కింద వీటిని జూన్ నాటికి జారీ చేయాలని కాలేజీలను ఆదేశించింది. విద్యార్థుల అకడమిక్ అచీవ్‌మెంట్స్, సర్టిఫికెట్స్, క్రెడిట్స్ డిజిటల్‌గా స్టోర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి ఆధార్, పేరెంట్స్ అనుమతి తప్పనిసరి.
News February 13, 2025
స్థానిక సంస్థల్లో నోటా.. పార్టీలు ఏమన్నాయంటే?

TG: ఏకగ్రీవం లేకుండా <<15405631>>ఎన్నికల నిర్వహణపై<<>> ఈసీతో భేటీలో ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహించొద్దని కాంగ్రెస్, సీపీఎం సూచించాయి. రీ ఎలక్షన్ నిర్వహించాలని BRS, సీపీఐ, జనసేన, ఆప్ పేర్కొన్నాయి. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకే దీనిపై స్పందిస్తామని బీజేపీ తెలిపింది. దీంతో ఎన్నికల నియమావళిలో మార్పుపై త్వరలోనే ఈసీ నిర్ణయం తీసుకోనుంది.
News February 13, 2025
కాసేపట్లో మోదీ, ట్రంప్ కీలక భేటీ

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కాసేపట్లో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. వలస విధానం, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ల తరలింపు, ట్రేడ్, టారిఫ్స్, విదేశాంగ విధానాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే భారత్ ఖరీదైన బైకులపై టారిఫ్స్ తగ్గించింది. ఈ పర్యటన తర్వాత మరిన్ని దిగుమతులపై టారిఫ్ తగ్గించే అవకాశం ఉంది.