News March 16, 2024
లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికలు చావోరేవో! – 2/2
లెఫ్ట్ పార్టీలకు కేరళ ఒక్కటే కంచుకోటగా మిగిలింది. LDF, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని UDF రాష్ట్రంపై పట్టుబిగించాలని భావిస్తున్నాయి. 2004లో గరిష్ఠంగా CPM (43), CPI (10), రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (3), ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (3) లోక్సభ సీట్లు గెలిచాయి. ఆ తర్వాత పతనమవసాగాయి. పొత్తులతో సీట్ల కేటాయింపు తగ్గడం, BJP విస్తరిస్తుండటంతో లెఫ్ట్ పార్టీలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.
Similar News
News November 21, 2024
పెన్షన్లపై కీలక ఆదేశాలు
AP: పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఇవాళ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వరుసగా 2 నెలలు తీసుకోకపోయినా మూడో నెల మొత్తం పింఛన్ ఇస్తామని తెలిపింది. NOV 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, DEC 1న రెండు నెలల పింఛన్ అందిస్తామని వెల్లడించింది. వరుసగా 3 నెలలు తీసుకోకపోతే పెన్షన్ను రద్దు చేస్తామంది. అలాంటి వారు తగిన కారణాలతో WEA/WWDS/MPDO/కమిషనర్లకు విన్నవిస్తే పెన్షన్లను పునరుద్ధరిస్తామని పేర్కొంది.
News November 21, 2024
‘నో లీవ్స్.. జ్వరమొచ్చినా రావాల్సిందే’.. ఆఫీస్ నోటీస్ వైరల్
డిసెంబర్ను విదేశాల్లో వెకేషన్ మంత్గా పరిగణిస్తుంటారు. అక్కడివారందరూ సుదీర్ఘ సెలవులో టూర్లకు వెళ్తుంటారు. దీంతో ఇండియా నుంచి వారికి పనిచేసే కంపెనీలు బిజీ అయిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కంపెనీకి చెందిన నోటీస్ వైరలవుతోంది. ‘అత్యంత బిజీగా ఉండే రోజులు కాబట్టి ఈనెల 25 నుంచి డిసెంబర్ 31వరకు సెలవులుండవు. లీవ్స్ బ్లాక్ చేశాం. అనారోగ్యంగా ఉన్నా మినహాయింపులు ఉండవు’ అని సదరు కంపెనీలో నోటీసు అంటించారు.
News November 21, 2024
సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ
IND మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ అదరగొడుతున్నారు. కూచ్ బెహార్ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ తరఫున అద్భుతమైన డబుల్ సెంచరీ చేశారు. 229 బంతుల్లోనే అజేయ ద్విశతకం బాదేశారు. ఇందులో 34 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్లో మేఘాలయ 260 పరుగులకు ఆలౌటైంది. ఆర్యవీర్ విజృంభణతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ 468/2 స్కోర్ చేసింది.