News March 16, 2024

లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికలు చావోరేవో! – 2/2

image

లెఫ్ట్ పార్టీలకు కేరళ ఒక్కటే కంచుకోటగా మిగిలింది. LDF, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని UDF రాష్ట్రంపై పట్టుబిగించాలని భావిస్తున్నాయి. 2004లో గరిష్ఠంగా CPM (43), CPI (10), రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (3), ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (3) లోక్‌సభ సీట్లు గెలిచాయి. ఆ తర్వాత పతనమవసాగాయి. పొత్తులతో సీట్ల కేటాయింపు తగ్గడం, BJP విస్తరిస్తుండటంతో లెఫ్ట్ పార్టీలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.

Similar News

News October 14, 2024

న్యూ లిక్కర్ పాలసీ.. ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం

image

AP: మద్యం షాపులకు ఇవాళ జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. షాపు దక్కించుకున్న వారు చెల్లించే తొలి విడత లైసెన్స్ రుసుముతో సుమారు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుంది. అలాగే వారం రోజులు సరకు కొనుగోలు ద్వారా మరో రూ.300 కోట్లకు పైగా వస్తుంది. ఇప్పటికే ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం లభించింది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది.

News October 14, 2024

రేషన్ బియ్యం తింటే ఇన్ని లాభాలా?

image

రూపాయికే కిలో బియ్యం అనేసరికి అంతా చులకనగా చూస్తుంటారు. మార్కెట్‌లో దొరికే సన్న బియ్యంవైపు మొగ్గుచూపుతుంటారు. కానీ, రేషన్ బియ్యం తింటే పోషకాలు పుష్టిగా లభిస్తాయనే విషయం మీకు తెలుసా? ప్రజల్లో రక్తహీనత, విటమిన్ల లోపం ఉందని గుర్తించిన కేంద్రం.. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తోంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12లను యాడ్ చేసిన బియ్యాన్ని 2028 DEC వరకు ఉచితంగా ఇవ్వనుంది.
SHARE IT

News October 14, 2024

సీఐడీకి జెత్వానీ కేసు

image

AP: ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసు దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇప్పటివరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేయగా, ఆ ఫైళ్లన్నింటినీ సీఐడీకి అప్పగించాలని డీజీపీ తిరుమలరావు ఆదేశించారు. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, విశాల్ గున్నీ, కాంతిరాణాలను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది.