News April 1, 2024

ఏప్రిల్ 2 నుంచి ఈ గూగుల్ యాప్ బంద్

image

గూగుల్ పాడ్‌కాస్ట్‌ యాప్ ఏప్రిల్ 2 నుంచి పని చేయదు. ఈ నేపథ్యంలో యూజర్లు తమ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. ఈ పాడ్‌కాస్ట్ తరహా సేవలు యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో అందించనుంది. పాడ్‌కాస్ట్ డేటా యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే.. పాడ్‌కాస్ట్‌ యాప్‌లో ఎక్స్‌పోర్ట్స్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ యూట్యూబ్ మ్యూజిక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Similar News

News March 20, 2026

తొలిసారి రూ.93కు చేరిన రూపీ విలువ

image

ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధంతో భారత రూపాయి విలువ క్రమంగా పతనమవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇవాళ మరింత క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. 92.92 వద్ద ఉన్న రూపీ విలువ ఎర్లీ ట్రేడ్‌‌లో పడిపోయి 93కు చేరింది.

News March 20, 2026

మొయినాబాద్ కేసు.. కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా

image

TG: మొయినాబాద్ ఫాంహౌస్ కేసు కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా పడింది. కస్టడీ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్‌ను వారంపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News March 20, 2026

వివాహంలో ఆటంకాలు.. సర్ప దోష నివారణకు సూచనలు

image

జాతకంలో సప్తమ, అష్టమ స్థానాల్లో రాహువు లేదా కేతువు ఉన్నప్పుడు సర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతుంటాయి. ఈ దోష నివారణకు కాళహస్తి వంటి క్షేత్రాల్లో రాహు-కేతు శాంతి పూజ చేయించుకోవడం ఉత్తమం. ఇంట్లో రోజూ దుర్గా చాలీసా పఠిస్తే రాహువు ప్రభావం తగ్గుతుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల వివాహానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.