News January 9, 2025

ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ ఘటన: జగన్

image

AP: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగిందని జగన్ ఆరోపించారు. TTD, పోలీసులు కౌంటర్ల వద్ద కనీస ఏర్పాట్లు చేయలేదన్నారు. భక్తులను పట్టించుకోకుండా, క్యూ లైన్లలో నిలబెట్టకుండా, ఒకేచోట గుమిగూడేలా చేశారని విమర్శించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే BNS 105(ఉద్దేశపూర్వకంగా మృతికి కారకులు) బదులు తీవ్రత తక్కువగా ఉండే BNS 194(ప్రమాదవశాత్తూ దొమ్మీ) సెక్షన్లతో కేసులు పెట్టడం దారుణమన్నారు.

Similar News

News January 14, 2025

అథ్లెట్‌పై అత్యాచారం.. 44 మంది అరెస్ట్

image

కేరళలో ఓ అథ్లెట్ బాలిక(18)పై ఐదేళ్లుగా 62 మంది కామాంధుల <<15126560>>లైంగిక వేధింపుల<<>> కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు 44 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై 30 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు మృగాళ్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. నిందితులెవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.

News January 14, 2025

గంభీర్ కోచ్ పదవికి ఎసరు?

image

త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు ప్రదర్శనపైనే హెడ్ కోచ్ గంభీర్ పదవీకాలం పొడిగింపు ఆధారపడి ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. CT తర్వాత BCCI రివ్యూ నిర్వహించి నిర్ణయం తీసుకోనుందట. అందులోనూ భారత్ విఫలమైతే గంభీర్‌ను కోచ్‌గా తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గతేడాది జులైలో గౌతీ కోచ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమ్ ఇండియా 10 టెస్టుల్లో 6 ఓడిపోయింది. BGT సందర్భంగా చెలరేగిన వివాదాలు తెలిసినవే.

News January 14, 2025

మోదీని కేజ్రీవాల్ ఫాలో అవుతున్నారు: రాహుల్

image

ఢిల్లీలో అవినీతి, ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతున్నా ప్ర‌ధాని మోదీ త‌ర‌హాలో కేజ్రీవాల్ కూడా ప్రచారం, అబ‌ద్ధపు హామీల విధానాన్ని అనుసరిస్తున్నారని రాహుల్ గాంధీ దుయ్య‌బ‌ట్టారు. ఢిల్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌కు రాహుల్‌ దిశానిర్దేశం చేశారు. ఆప్‌పై శాయ‌శ‌క్తులా పోరాడాల‌ని, వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపాల‌ని, అధికార పార్టీకి గ‌ట్టి పోటీ ఇవ్వాల‌న్నారు. మరోవైపు 2020లో కాంగ్రెస్ ఢిల్లీలో ఒక్క సీటూ గెలవలేదు.