News May 25, 2024

ఇది మాకు గొప్ప సీజన్: సంగక్కర

image

ఈ ఏడాది తమ ప్లేయర్లు అద్భుతంగా ఆడారని RR డైరెక్టర్ సంగక్కర కొనియాడారు. ఈ సీజన్ గొప్పగా గడిచిందన్నారు. ‘కొన్నిసార్లు ఎదురుదెబ్బలు సహజం. లీగ్ తొలి దశలో దాదాపు అన్ని మ్యాచ్‌లు ఓడిన RCB తర్వాత పుంజుకుంది. మళ్లీ ప్లేఆఫ్స్‌లో మా చేతిలో ఓడింది. T20 క్రికెట్ అంటే ఇలాగే ఉంటుంది. ఇవాళ ఎవరు బాగా ఆడితే వారిదే విజయం. లీగ్ చివరి దశలో వరుస ఓటములు మా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయలేదు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 11, 2026

ఫిరాయింపు MLAల కేసు.. సంచలన తీర్పు

image

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. వారు పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. స్పీకర్ తాజా నిర్ణయంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ లభించినట్లయింది.

News March 11, 2026

IPL-2026: ఫస్ట్ మ్యాచ్ ఈ జట్ల మధ్యే?

image

ఈసారి ఐపీఎల్ ఆరంభ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ తలపడబోవని క్రిక్‌బజ్ తెలిపింది. బెంగళూరు, పంజాబ్ వేర్వేరుగా ఆడనున్నాయని పేర్కొంది. సంప్రదాయం ప్రకారం హై ప్రొఫైల్ మ్యాచుతో టోర్నమెంట్ స్టార్ట్ చేస్తారు. ఈసారి ఫస్ట్ మ్యాచ్ మార్చి 28న బెంగళూరు-చెన్నై మధ్య జరిగే అవకాశం ఉందని తెలిపింది. రన్నరప్ అయిన పంజాబ్ 29న GTతో ఆడవచ్చని వెల్లడించింది. కాగా మార్చి 12/13న IPL షెడ్యూల్ రిలీజ్ కానుంది.

News March 11, 2026

LPG, CNG, PNG, LNGకి తేడాలు తెలుసా?

image

LPG (Liquefied Petroleum Gas): ఇళ్లలో వంట కోసం వాడతారు.
CNG (Compressed Natural Gas): వాహనాల్లో తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది.
PNG (Piped Natural Gas): గ్యాస్‌ను పైపులైన్ల ద్వారా నేరుగా ఇళ్లు, రెస్టారెంట్లు, ఇండస్ట్రీలకు చేరుస్తారు. మీటర్ రీడింగ్ ప్రకారం బిల్ వేస్తారు. వంటగ్యాస్ సిలిండర్లకు ఇది ప్రత్యామ్నాయం.
LNG (Liquefied Natural Gas): దీన్ని ఇండస్ట్రీలు, పవర్ ప్లాంట్లలో వాడతారు.