News January 25, 2025

ఇది దేశం గర్వించదగిన సందర్భం: రాష్ట్రపతి

image

రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఈ గణతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఇది యావత్ దేశం గర్వించదగిన సందర్భమన్నారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ చాలా ఎదిగిందని వివరించారు. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని అందరూ స్మరించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అణుగుణంగా కొత్త చట్టాలను రూపొందించి అమల్లోకి తెచ్చామని ఆమె గుర్తుచేశారు.

Similar News

News February 8, 2025

యూరియా కొరత.. రైతన్న వెత

image

TG: ఓవైపు యాసంగి వరిసాగు కీలక దశకు చేరుకున్న సమయంలో రైతన్నల్ని యూరియా కొరత వేధిస్తోంది. సుమారు 50 లక్షల ఎకరాల్లో ఈ సీజన్ వరి సాగవుతోంది. గత నెలలోనే 90శాతం వరినాట్లు పూర్తయ్యాయి. ఇలాంటి దశలో కీలకమైన యూరియా దొరక్కపోవడం అన్నదాతల్లో ఆందోళన పెంచుతోంది. వచ్చిన స్టాకు వచ్చినట్లు అయిపోతోంది. దీంతో వ్యాపారులు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News February 8, 2025

ఢిల్లీ అసెంబ్లీ.. ఎప్పుడు ఏ పార్టీది అధికారం?

image

1952లో 48 స్థానాలకు ఎన్నికలు జరగగా INC 39 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 1956-93 మధ్య ఎన్నికలు జరగలేదు. 1993లో 70 స్థానాలకు గాను BJP 49 చోట్ల గెలిచి సీఎం పదవి చేపట్టింది. 1998, 2003, 2008లో వరుసగా 52, 47, 43 స్థానాలతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. 2013లో ఆప్(28)+కాంగ్రెస్(8) ప్రభుత్వం, 2015, 20లో వరుసగా 67, 62 స్థానాల్లో ఆప్ బంపర్ విక్టరీ సాధించింది. 2025 ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News February 8, 2025

BREAKING: ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలను తెరవనున్నారు. మొత్తం 19 కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. 70 స్థానాల్లో 36 చోట్ల విజయం సాధించిన పార్టీ అధికారం చేపట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలపై ఓ క్లారిటీ రానుంది. రిజల్ట్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు WAY2NEWS యాప్‌లో తెలుసుకోండి.
Stay Tuned.

error: Content is protected !!