News July 16, 2024

రూ.15,000 రావాలంటే ఇది తప్పనిసరి!

image

AP: ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా ప్రభుత్వం ఏడాదికి రూ.15,000 అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పథకం కోసం విద్యార్థుల తల్లులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు తెలిపారు. ఈమేరకు పాఠశాలల్లోనే ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా పథకం మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదని, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది.

Similar News

News October 6, 2024

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరివురు హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.

News October 6, 2024

డీఎస్సీ సర్టిఫికెట్ పరిశీలన పూర్తి

image

TG: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఒక్కో ఉద్యోగానికి 1:3 చొప్పున 25,924 మందిని వెరిఫికేషన్‌కు పిలవగా 24,466 మంది హాజరయ్యారు. మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ కోటాలో టీచర్ పోస్టులకు కొన్ని జిల్లాలో వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. కాగా డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈ నెల 9న LB స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందజేయనున్నారు.

News October 6, 2024

ఐదో రోజు అట్ల బతుకమ్మ

image

TG: బతుకమ్మ పండగ నిర్వహించే తొమ్మిది రోజుల్లో రోజుకో విశిష్ఠత ఉంది. ఇవాళ ఐదో రోజును అట్ల బతుకమ్మగా పిలుస్తారు. నానబెట్టిన బియ్యాన్ని మర పట్టించి ఆ పిండితో అట్లు పోసి గౌరమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. ఆడవాళ్లు వీటిని ఒకరికొకరు వాయినంగా ఇచ్చుకుంటారు. ఇవాళ బతుకమ్మను ఐదు వరుసల్లో వివిధ పూలతో చేస్తారు.