News August 5, 2024
ఇది భారతీయులు అడగని యుద్ధం!

ఉపాధి కోసం రష్యా వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన భారతీయులు నరకయాతన అనుభవిస్తున్నారు. అక్రమ చొరబాటుదార్లను రష్యా ప్రభుత్వం బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపుతోంది. ఇలా ఇప్పటిదాకా 8 మంది భారతీయులు రష్యా తరఫున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 12 మంది రష్యా సైన్యం నుంచి ఇప్పటికే విడుదలవ్వగా, మరో 63 మంది తమను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు.
Similar News
News March 19, 2026
తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయంటే?

నారద మహర్షి ఓసారి ఐహిక సుఖాలకు ఆకర్షితుడై స్త్రీ రూపాన్ని ధరించి ఓ రాజును పెళ్లాడి 60 మంది సంతానాన్ని పొందుతారు. తాను బ్రహ్మర్షి అని మరచిన నారదుడికి కనువిప్పు కలిగించడానికి విష్ణువు నిర్ణయిస్తారు. ఆయన మాయతో 60 మంది పుత్రులూ మరణిస్తారు. దీంతో తన సంతానం పేర్లు ఎప్పటికీ నిలిచిపోవాలని నారదుడు కోరతారు. ఆ 60 మంది పేర్లే తెలుగు సంవత్సరాల పేర్లుగా వ్యవహరిస్తున్నామని ఓ కథ ప్రచారంలో ఉంది.
News March 19, 2026
పిల్లలు తనకు పుట్టలేదన్న భర్త.. DNA టెస్టుకు కోర్టు నిరాకరణ

AP: భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించడానికి తన ఇద్దరు పిల్లలకు DNA పరీక్ష నిర్వహించాలంటూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న వాదనను తోసిపుచ్చింది. ఇది పిల్లల గౌరవానికి సంబంధించిన అంశమని, బలమైన కారణం లేకుండా DNA టెస్టుకు ఆదేశించలేమని తేల్చి చెప్పింది. భార్య తనను విడిచి వెళ్లిందని తొలుత భర్త విడాకుల పిటిషన్ వేశారని, అక్రమ సంబంధం గురించి కాదని పేర్కొంది.
News March 19, 2026
పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

సాధారణ అర్థంలో పరాభవ అంటే అవమానం, ఓటమి. దీని ప్రకారం ఈ సంవత్సరమంతా అపజయాలు ఉంటాయని కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి ధర్మబద్ధంగా కష్టపడేవారికి విజయాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పరా-అమ్మవారు, భవ-ఉండు/ఆవిర్భావం/శివుడు అనే అర్థం. అంటే అమ్మవారికి సమీపాన ఉండటం లేదా పరాశక్తి ఆవిర్భావం లేదా అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటారు’ అని పేర్కొంటున్నారు.


