News December 13, 2024
మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగే మూడో టెస్టు కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తమ తుది జట్టును ప్రకటించారు. గాయం నుంచి కోలుకున్న జోష్ హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో ఆడతారని తెలిపారు. ప్లేయింగ్ XI: ఖవాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, కమిన్స్ (C), మిచెల్ స్టార్క్, లయన్, జోష్ హేజిల్‌వుడ్. రేపు గబ్బాలో మూడో టెస్టు ప్రారంభం కానుంది.
Similar News
News October 18, 2025
నేడు ఈ వ్రతం చేస్తే బాధల నుంచి విముక్తి

శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని నేడు ఆచరిస్తే అపారమైన ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు, ఉద్యోగాభివృద్ధి కోరేవారు ఈ వ్రతం చేస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరిగి, దారిద్య్రం తొలగి, అన్నింటా విజయం లభిస్తుందంటున్నారు. ధనాదిదేవత లక్ష్మీదేవి, ధనాధ్యక్షుడు కుబేరుని ఆశీస్సులతో శుభం కలుగుతుందంటున్నారు.
News October 18, 2025
NHIDCLలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NHIDCL)34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/BE ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోరు సాధించిన వారు NOV 3వరకు అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోరు ఆధారంగా ఎంపిక ఉంటుంది. నెలకు రూ.50వేల నుంచి రూ.1.60లక్షల వరకు జీతం అందుతుంది. వెబ్సైట్: https://www.nhidcl.com/
News October 18, 2025
సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జాబ్ ఛార్ట్‌తో పాటుగా కొన్ని అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరుల డేటా సేకరణ, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, సేవలు చేర్చాలని, సచివాలయాలకు వచ్చిన వినతుల పరిష్కారం, విపత్తుల సమయంలో హాజరు, ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలని పేర్కొంది. ఉత్తర్వులు అతిక్రమించిన వారిపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.