News May 4, 2024
ఇవాళ సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..

AP: ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆయన మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హిందూపురంలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పలమనేరులో జరిగే సభకు హాజరవుతారు. ఆ తర్వాత 3 గంటలకు నెల్లూరులో జరిగే సభలో పాల్గొంటారు.
Similar News
News October 31, 2025
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: ఇంటర్ బోర్డు పరీక్షల <
News October 31, 2025
పంచ భూతాలే మానవ శరీరం

మానవ దేహం పంచభూతాలతో ఏర్పడింది. చర్మం, వెంట్రుకలు, కండరాలు భూతత్వానికి సంబంధించినవి. ఆకలి, నిద్ర, దాహం అగ్నితత్వానికి చెందినవి. నడవడం, పరుగెత్తడం వంటి కదలికలన్నీ వాయుతత్వం. మూత్రం, రక్తం, వీర్యం వంటి ద్రవాలు జలతత్వం కిందకి వస్తాయి. గరుడ పురాణం ప్రకారం.. ఆలోచన (చింత), శబ్దం, దుఃఖం (శోకం) అనేవి ఆకాశతత్వం లక్షణాలు. నూనెతో తలకు, ఒంటికి చేసే అభ్యంగనం ద్వారా ఈ సర్వేంద్రియాలకు శాంతి, శక్తి లభిస్తాయి.
News October 31, 2025
5,346 టీచర్ పోస్టులు.. దరఖాస్తు చేసుకున్నారా?

ఢిల్లీలో 5,346 TGT పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులైనవారు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.44,900 – రూ.1,42,400 అందుతుంది. వెబ్సైట్: https://dsssb.delhi.gov.in/


