News May 4, 2024
ఇవాళ సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..

AP: ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆయన మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హిందూపురంలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పలమనేరులో జరిగే సభకు హాజరవుతారు. ఆ తర్వాత 3 గంటలకు నెల్లూరులో జరిగే సభలో పాల్గొంటారు.
Similar News
News December 11, 2025
పెద్దపల్లి: సమయం లేదు మిత్రమా.. త్వరపడండి…?

పెద్దపల్లి జిల్లాలోని 5 మండలాలు కమాన్పూర్, మంథని, ముత్తారం రామగిరి, కాల్వ శ్రీరాంపూర్‌లలో జరుగుతున్న పోలింగ్ చివరి దశకు చేరుకుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే సమయం ఉండడంతో ఓటర్లు చలిని సైతం లెక్కచేయకుండా క్యూలో నిలబడి ఓట్లు వేశారు. ఓటు వేయని వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంకా అరగంట సమయం మాత్రమే మిగిలి ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది.
News December 11, 2025
AUS ప్రపంచ కప్ టీమ్‌లో భారత సంతతి ప్లేయర్లు

ICC మెన్స్ U19 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా 15 మందితో జట్టును ప్రకటించింది. ఇందులో ఇద్దరు భారత సంతతి క్రికెటర్లు చోటుదక్కించుకున్నారు. ఆర్యన్ శర్మ(ఫొటోలో), జాన్ జేమ్స్ అనే యువ ఆటగాళ్లు ఇటీవల INDతో జరిగిన యూత్ టెస్టులు, వన్డేల్లో అదరగొట్టారు. దీంతో తాజాగా ప్రపంచ కప్‌కు ఎంపికయ్యారు. శ్రీలంక, చైనా మూలాలున్న ప్లేయర్లు సైతం జట్టులో ఉండటం గమనార్హం. ఈ టోర్నీ జనవరి 15 నుంచి నమీబియా, జింబాబ్వేలో జరగనుంది.
News December 11, 2025
పిల్లలకు SM బ్యాన్ చేయాలి: సోనూసూద్

AUS తరహాలో INDలోనూ U16 పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నటుడు సోనూసూద్ కూడా ఇదే విషయాన్ని Xలో పోస్ట్ చేశారు. పిల్లలు స్క్రీన్ అడిక్షన్‌కు దూరమై నిజమైన బాల్యాన్ని గడపాలని, కుటుంబ బంధాలు బలపడాలని ఆయన పేర్కొన్నారు. దీనికి నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే పేరెంట్స్ ఫోన్లకు అతుక్కుపోతుంటే పిల్లలెలా మారుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ COMMENT.


