News June 12, 2024
గతంలో భూముల ధరల పెంపు ఇలా
TG: 2021-22లో వ్యవసాయ భూముల ఎకరం కనిష్ఠ ధరను ప్రభుత్వం ₹75వేలుగా నిర్ధారించింది. తక్కువ ధరలున్న చోట 50%, మధ్య స్థాయి ధరలున్న చోట 40%, ఎక్కువగా ఉన్న చోట 30% పెంచింది. ఖాళీ స్థలాలకు ధరలు తక్కువగా ఉన్న చోట 50%, మధ్య స్థాయిలో ఉంటే 40%, ఎక్కువగా ఉన్న చోట 30% పెంపు అమలు చేసింది. కొత్త మార్కెట్ విలువలను TG భూముల సవరణ మార్గదర్శకాలు-1998, సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు ఖరారు చేయనుంది.
Similar News
News December 23, 2024
మరో భారతీయ అమెరికన్‌కు ట్రంప్ కీలక పదవి
మరో భారతీయ అమెరికన్‌కు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవిని కట్టబెట్టారు. ఆంత్రప్రెన్యూర్, VC, రచయిత శ్రీరామ్ కృష్ణన్‌ను AIపై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ సలహాదారుగా ఎంపిక చేశారు. ‘AI, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా అనేక అంశాల విధాన రూపకల్పనలో డేవిడ్ సాక్స్‌తో కలిసి శ్రీరామ్ కృష్ణన్ పనిచేస్తారు’ అని ట్రంప్ తెలిపారు. మైక్రోసాఫ్ట్, ట్విటర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్‌లో నాయకత్వ బాధ్యతల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం.
News December 23, 2024
అతిగా నీరు తాగి ICUలో చేరిన మహిళ
‘అతి’ అనర్థాలకు దారి తీస్తుందట. ఓ మహిళ విషయంలోనూ అదే జరిగింది. నిద్ర లేవగానే 4 లీటర్ల నీరు తాగిన ఓ 40ఏళ్ల మహిళ కొన్ని రోజుల పాటు ఆస్పత్రి పాలైంది. నీరు తాగిన గంటలోనే హైపోనాట్రేమియా(రక్తంలో సోడియం గాఢత తగ్గడం)తో ఆమెకు తలనొప్పి, వికారం, వాంతులు వచ్చాయి. కొన్ని నిమిషాల తర్వాత ఆమె స్పృహ కోల్పోగా ICUలో చికిత్స పొందారు. రోజుకు 2.5-3.5 లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు సూచించారు.
News December 23, 2024
‘దేవర-2’ స్క్రిప్ట్ పనులు ప్రారంభం?
‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ప్రారంభమైనట్లు సినీ వర్గాలు తెలిపాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్ గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. తాజాగా ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.