News February 24, 2025
వైసీపీ దివాళాకోరుతనానికి ఇది నిదర్శనం: సత్య కుమార్

AP: గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ సభాసంప్రదాయాలను వైసీపీ మంటగలిపిందని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని గుర్తించాలంటూ నినాదాలు చేయడం వైసీపీ దివాళాకోరుతనానికి నిదర్శనమని Xలో దుయ్యబట్టారు. ఆ పార్టీని ప్రతిపక్షంగా ప్రజలు గుర్తించలేదని, నాయకత్వాన్ని తిరస్కరించారని అన్నారు. ప్రజలు ఇవ్వని హోదాను బలవంతంగా పొందాలనుకోవడం వారి తీర్పును అవమానించడమేనని పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
నాన్-ఏసీ కోచ్ల్లోనూ దుప్పటి, దిండు

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.
News November 28, 2025
హైదరాబాదీ బిర్యానీ.. వరల్డ్లో బెస్ట్!

భారతీయులు ఇష్టపడే వంటకాల్లో ఒకటైన హైదరాబాదీ బిర్యానీ ప్రపంచ గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ‘వరల్డ్ బెస్ట్ రైస్ డిషెస్’ లిస్టులో HYD బిర్యానీ 10వ స్థానంలో నిలిచింది. టాప్-50లో ఇండియా నుంచి ఉన్న ఏకైక వంటకం ఇదే కావడం విశేషం. కాగా తొలి మూడు స్థానాల్లో జపాన్ వంటకాలైన ‘నెగిటోరో డాన్’, ‘సుశి’, ‘కైసెండన్’ ఉన్నాయి. ప్రపంచమే మెచ్చిన HYD బిర్యానీ మీకూ ఇష్టమా?COMMENT
News November 28, 2025
RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.


