News January 17, 2025

ఏపీ ప్రజలు గర్వించే విషయమిది: సీఎం చంద్రబాబు

image

AP: స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు అంటే పరిశ్రమ మాత్రమే కాదని, దీనికి ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు.

Similar News

News November 27, 2025

పార్టీ నిర్ణయిస్తే సీఎంగా డీకేను స్వాగతిస్తాం: పరమేశ్వర

image

కర్ణాటకలో CM మార్పుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను కూడా సీఎం ఆశావహుల్లో ఉన్నా. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కూడా ఆ పదవికి తగిన అభ్యర్థే. కానీ ఆ పోస్టుకు హైకమాండ్ DK శివకుమార్‌ను నిర్ణయిస్తే స్వాగతిస్తాం. పార్టీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అధిష్ఠానానికి తెలుసు. ప్రస్తుత సీఎం సిద్దరామయ్య, డీకే మధ్య డీల్ గురించి నాకు తెలియదు’ అని పేర్కొన్నారు.

News November 27, 2025

రబ్బరు సాగు.. ఒక్కసారి నాటితే 40 ఏళ్ల దిగుబడి

image

కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవాలో రబ్బరు సాగు ఎక్కువ. APలోని కొన్నిప్రాంతాల్లో రైతులు రబ్బరును సాగు చేస్తున్నారు. పంట నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమై 40 ఏళ్ల పాటు దిగుబడి, ఆదాయం వస్తుంది. ఈ పంటకు ఉష్ణ ప్రాంతాలు అనువుగా ఉంటాయి. కనీస ఉష్ణోగ్రత 25డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 34డిగ్రీల సెల్సియస్‌గా ఉంటే దిగుబడి బాగుంటుంది. ఈ మొక్క పెరగాలంటే దాదాపు రోజుకు 6గంటల సూర్యకాంతి అవసరం ఉంటుంది.

News November 27, 2025

స్విగ్గీని బురిడీ కొట్టించిన కస్టమర్.. నెటిజన్ల ఫైర్!

image

ఆన్‌లైన్‌ సైట్స్‌లో వస్తువులు డ్యామేజ్ వస్తే సదరు సంస్థ రీఫండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి డూప్లికేట్ ఫొటోతో ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌’ను బురిడీ కొట్టించాడు. స్విగ్గీలో ఆర్డర్ చేసిన గుడ్ల ట్రే ఫొటోను, జెమిని నానో AI యాప్ ద్వారా గుడ్లు పగిలినట్లుగా ఎడిట్ చేసి కస్టమర్‌ కేర్‌కు పంపి, పూర్తి రీఫండ్‌ను పొందాడు. ఇలా చేయడం సరికాదని, నిజమైన బాధితులు నష్టపోతారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.