News March 30, 2025
స్టార్క్‌కు టీ20ల్లో ఇదే తొలిసారి

మిచెల్ స్టార్క్ తొలిసారి టీ20ల్లో ఐదు వికెట్లు తీశారు. ఈ 35 ఏళ్ల ప్లేయర్ టెస్టుల్లో 15, వన్డేల్లో 9 సార్లు ఐదేసి వికెట్లు తీశారు. అయితే టీ20ల్లో 5 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఐపీఎల్-2025లో డీసీ తరఫున ఈ ఘనత సాధించారు. SRHతో మ్యాచులో కీలక వికెట్లు తీసి ఆ జట్టును తక్కువ పరుగులకే పరిమితం చేశారు.
Similar News
News April 22, 2025
ఇన్‌స్టాలో RCB మరో మైలురాయి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో ఆర్సీబీ ఫ్రాంచైజీ మరో మైలురాయి చేరుకుంది. అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఈ టీమ్‌కు 19 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత CSK (18.3M), MI(17M), KKR(7.3M), SRH (5.4M), RR(4.9M), GT (4.7M), DC (4.5M), PBKS(4M), LSG (3.6M) ఉన్నాయి.
News April 22, 2025
అందుకే జగన్ కడుపు మండుతోంది: అనగాని

AP: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని ప్రగతి, సంక్షేమం సాగుతోందని.. అందుకే మాజీ CM జగన్ కడుపు మండుతోందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఎద్దేవా చేశారు. అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్‌ను అలవాటుగా మార్చుకున్న ఆయన తన బురదను ఎదుటివారికి రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సిగ్గులేకుండా ఒక ఆడపిల్లను వేధించిన అధికారులను వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
News April 22, 2025
అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు

TG: కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని AISF తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. JEE మెయిన్ ఫలితాల్లో తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.