News December 3, 2024
బెస్ట్ బ్లెండెడ్ మాల్ట్ స్కాచ్ విస్కీ ఇదే!
ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ వరల్డ్ స్పిరిట్స్ కాంపిటీషన్ (NYWSC)-2024లో షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ మద్దతు ఉన్న D’YAVOL విస్కీ సత్తా చాటింది. ప్రపంచంలోనే బెస్ట్ ఓవరాల్ స్కాచ్ & బెస్ట్ ఆఫ్ క్లాస్ విస్కీగా నిలిచింది. దీనిని విభిన్న పరిశ్రమలకు చెందిన నిపుణుల బృందం నిర్ణయిస్తుంది. దీనిపై D’YAVOL కో ఫౌండర్ షారుఖ్ ఖాన్ స్పందిస్తూ శ్రద్ధ, అభిరుచి, అంకితభావానికి నిదర్శనం అని తెలిపారు.
Similar News
News January 20, 2025
వరల్డ్ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ
ఇండియన్ ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ టీమ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. కదులుతున్న బైక్స్‌పై అత్యంత ఎత్తైన (20.4 ఫీట్) మానవ పిరమిడ్ నిర్మించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 7 బైక్‌లపై 40 మంది 2కి.మీ మేర ప్రయాణించడంతో ఈ ఘనతను అందుకుంది. ఆర్మీలోని మోటార్ సైకిల్ రైడర్ డిస్‌ప్లే టీమ్‌ను ‘డేర్ డెవిల్స్’ అని పిలుస్తారు.
News January 20, 2025
RGKarVerdict; గరిష్ఠ శిక్ష సరైనది: CBI
హత్యాచార దోషి సంజయ్‌కు ఉరిశిక్ష సరైనదని CBI లాయర్ వాదించారు. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి గరిష్ఠ శిక్షను విధించాలని ప్రార్థిస్తున్నట్లు న్యాయస్థానానికి విన్నవించారు. మరొకరు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండేలా తీర్పు ఉండాలన్నారు. పీజీ మెడిసిన్ చేస్తూ IPS కావాలనుకున్న యువతి జీవితం, కలలను సంజయ్ చెరిపేశాడని CBI లాయర్ వాదించారు.
– మధ్యాహ్నం గం.2:45కి సీల్దా కోర్టు తీర్పు వెల్లడించనుంది.
News January 20, 2025
ట్రంప్ పార్టీ: నీతా అంబానీ కాంచీపురం పట్టుచీర స్పెషాలిటీ ఇదే!
డొనాల్డ్ ట్రంప్ ప్రైవేటు రిసెప్షన్‌లో నీతా అంబానీ కట్టుకున్న పట్టుచీరపై నెట్టింట చర్చ జరుగుతోంది. జాతీయ అవార్డు గ్రహీత బీ కృష్ణమూర్తి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. పురాణాల్లో కాంచీపురం మందిరాల ప్రాముఖ్యాన్ని శోధించి 100+ మోటిఫ్స్ డిజైన్ చేశారు. విష్ణువును ప్రతిబింబించేలా 2 తలల గరుడపక్షి, అమృతత్వం, దైవత్వానికి గుర్తుగా నెమళ్లను నేయించారు. దీనికి తోడుగా 18వ శతాబ్దపు వారసత్వ నగను నీతా ధరించారు.