News September 22, 2024
అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదే!
మన వద్ద కూడా అతని దగ్గరున్నటువంటి ఫోన్ ఉండాలి అనే స్థాయి నుంచి ఎవ్వరికీ ఉండని ఫోన్ కొనేందుకు రూ.లక్షలు వెచ్చించే స్థాయికి చేరుకున్నాం. మొబైల్ ఫోన్ వచ్చిన తొలినాళ్లలో ప్రతి ఇంట్లో ‘నోకియా 1100’ ఫోన్స్ ఉండేవి. ఇప్పటివరకూ అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదేనని మీకు తెలుసా? మొత్తం 250 మిలియన్ల ‘నోకియా 1100’ ఫోన్ల విక్రయాలు జరిగాయి. దీని తర్వాత ‘నోకియా 1110’ (248M), iPhone 6/6+ (222M) ఉన్నాయి.
Similar News
News October 5, 2024
మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ
TG: మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. సెర్ప్ సీఈవో ఛైర్మన్‌గా 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అటు మూసీ నిర్వాసితులకు ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 5, 2024
జెర్రి పడిందన్నది అవాస్తవం.. నమ్మొద్దు: TTD
తిరుమల అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందంటూ వస్తున్న ఆరోపణల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. అవి అవాస్తవాలని తేల్చిచెప్పింది. ‘వేలాదిమందికి వడ్డించేందుకు ప్రసాదాన్ని తయారుచేస్తారు. అంత వేడిలో ఓ జెర్రి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉందనడం ఆశ్చర్యకరం. ఇది కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తోంది. దయచేసి భక్తులు ఇలాంటి వార్తల్ని నమ్మొద్దని టీడీపీ విజ్ఞప్తి చేస్తోంది’ అని ఓ ప్రకటనలో కోరింది.
News October 5, 2024
Exit Polls: బీజేపీకి ప్రతికూల ఫలితాలు
JK, హరియాణా ఎన్నికల్లో BJPకి ప్రతికూల ఫలితాలు తప్పవని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 90 స్థానాలున్న JKలో BJP సాధించే సీట్లపై సర్వే అంచనాలు. *పీపుల్స్ పల్స్ 23-27 *దైనిక్ భాస్కర్ 20-25 *గలిస్తాన్ News 28-30 *India Today/CVoter 27-32. హరియాణా: పీపుల్స్ పల్స్ 26 *దైనిక్ భాస్కర్ 19-29 *మ్యాట్రిజ్ 18-24 * ధ్రువ్ రీసెర్చ్ 27-32. BJP రెండు చోట్లా మెజారిటీ మార్క్ సాధించలేదని సర్వేలు తేల్చాయి.