News October 5, 2024
ఛత్తీస్‌గఢ్‌లో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. CRPF, BSF, కోబ్రా, STF విభాగాలకు చెందిన 1500 మంది జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ అని బస్తర్ IG పేర్కొన్నారు. 2026 కల్లా మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ఇటీవలే స్పష్టంచేశారు.
Similar News
News November 2, 2024
‘పుష్ప2’లో శ్రీలీల ఐటమ్ సాంగ్?
‘పుష్ప-2’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఐటమ్ సాంగ్‌లో శ్రీలీల స్టెప్పులేయనున్నట్లు టాక్. దీని కోసం తొలుత బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ని సంప్రదించగా అది వర్కౌట్ కాలేదని, షూట్ దగ్గర పడుతుండటంతో శ్రీలీలను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సాంగ్‌లో శ్రీలీలతో పాటు సమంత కూడా పుష్పరాజ్‌తో కలిసి సందడి చేయనున్నట్లు సమాచారం.
News November 2, 2024
చిన్నారి హత్యాచారం ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
AP: తిరుపతి జిల్లాలో చిన్నారిపై <<14509648>>హత్యాచారం<<>> ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోంమంత్రి అనిత రేపు బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
News November 2, 2024
హిందు, ముస్లింలను ఒకేలా చూడాలి: ఒవైసీ
తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలని TTD ఛైర్మన్ BR.నాయుడు అనడంపై MIM MP అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘TTDలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఛైర్మన్ అంటున్నారు. అయితే మోదీ ప్రభుత్వం మాత్రం వక్ఫ్ బోర్డులు, వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులు ఉండటాన్ని తప్పనిసరి చేయాలనుకుంటోంది’ అని ఒవైసీ ట్వీట్ చేశారు. హిందువులను, ముస్లింలను ఒకేలా చూడాలని అభిప్రాయపడ్డారు.