News August 10, 2024
ప్రపంచంలోని అతిపెద్ద హైవే ఇదే!
ప్రపంచంలోనే అతి పొడవైన ‘మోటరబుల్ రోడ్’గా ‘పాన్ అమెరికన్ హైవే’ గిన్నిస్ రికార్డు సాధించింది. ఇది నార్త్ అమెరికాలోని కెనడాలో ప్రారంభమై అమెరికా, మెక్సికో, కోస్టారికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, బొలివీయా లాంటి 14 దేశాల మీదుగా సౌత్ అమెరికాలోని అర్జెంటీనా వరకు ఉంటుంది. సముద్రం, ఎడారులు, నదులు దాటుకుంటూ వెళ్లే ఈ హైవే మొత్తం పొడవు సుమారు 30వేల కిలోమీటర్లు కావడం విశేషం.
Similar News
News September 18, 2024
‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
నార్నె నితిన్ హీరోగా కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తూ ఈనెల 20న ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాది బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రానుండగా నాగవంశీ నిర్మిస్తున్నారు.
News September 18, 2024
మీ నోటికి తాళం వేసుకోండి చంద్రబాబు: అంబటి రాంబాబు
AP: రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే నోటికి తాళం వేస్తానన్న సీఎం చంద్రబాబు హెచ్చరికపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళాలు వేస్తారు? అక్రమంగా ఉన్న మీ ఇంటికి ముందు తాళం వేయండి. అప్పటి వరకు మీ నోటికి తాళం వేసుకోండి’ అని ట్వీట్ చేశారు.
News September 18, 2024
నెల్లూరులో జానీ మాస్టర్!
అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై నెల్లూరు పోలీసులను నార్సింగి పోలీసులు సంప్రదించారని సమాచారం. దీంతో జానీ మాస్టర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముంది.