News July 4, 2024

టీమ్ ఇండియా క్రికెటర్ల బ్రేక్ ఫాస్ట్ ఇదే!

image

టీమ్ ఇండియా క్రికెటర్లు ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు బస చేసిన ITC మౌర్య హోటల్‌లో వారి కోసం రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ బఫే ఉంచారు. రోహిత్‌కు వడాపావ్, కోహ్లీకి చోలే బటూరే అందించారు. చాక్లెట్ ట్రఫుల్ రోల్స్, నాన్ ఖాటాయ్, సినామన్ సుగర్ పాల్మీర్, సన్డ్రీడ్ టమాటా, అమర్‌నాథ్ పిన్‌వీల్ స్నాక్స్‌తోపాటు మామిడి, చెర్రీ వంటి పండ్లను కూడా బఫెలో పెట్టారు.

Similar News

News December 9, 2025

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్?

image

బ్లాక్‌బస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని చర్చ జరుగుతోంది. ఈ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ 15 ఏళ్ల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుందనే పాయింట్‌తో తెరకెక్కనుందని సమాచారం. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ‘3 ఇడియట్స్’లో ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

News December 9, 2025

చాట్ జీపీటీతో కొత్త వంగడాల సృష్టి సులభమా?

image

వాతావరణ మార్పులు, కరవు, వరదల వల్ల వ్యవసాయంలో కొత్త వంగడాల అవసరం పెరిగింది. కొత్త వంగడాల అభివృద్ధికి ప్రస్తుతం చాలా సమయం పడుతోంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా గుర్తించగలదు.

News December 9, 2025

తేగలు తింటే ఎన్ని లాభాలో..!

image

శీతాకాలంలో తాటి తేగలు (గేగులు) ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే తేగల్లో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తహీనత నివారణ, శరీర బరువును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. షుగర్ వ్యాధిగ్రస్థులూ తినొచ్చు. తాటి గింజలు మొల‌కెత్తిన‌ప్పుడు నేల‌లో నుంచి త‌వ్వి తీసిన మొల‌క‌లే ఈ తేగలు. మీరెప్పుడైనా టేస్ట్ చేశారా? comment