News May 11, 2024
ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఇదే(3/3)

లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీలో ఉన్నారు. విశాఖ లోక్సభలో అత్యధికంగా 33 మంది, రాజమండ్రిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీకి అత్యధికంగా 46 మంది, అత్యల్పంగా చోడవరం అసెంబ్లీకి ఆరుగురు పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో 79.84 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 83 శాతం పోలింగ్ జరిగే అవకాశముందని అంచనా.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<
News November 9, 2025
పాడి పశువుల కొనుగోళ్లు – ఈ జాగ్రత్తలతో మేలు

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.
News November 9, 2025
హనుమాన్ చాలీసా భావం – 4

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా ||
ఓ దేవా! నీవు బంగారు కాంతులీనే దేహంతో, అత్యంత శోభాయమానమైన సుందర వస్త్రాలను ధరించి విరాజిల్లుతావు. నీ చెవులకు ధరించిన మనోహరమైన కుండలాలు, మృదువుగా మెలికలు తిరిగిన (కుంచితమైన) నీ కేశాలు నీ రూపానికి అసాధారణ సౌందర్యాన్ని చేకూర్చుతాయి. నీ దివ్యమైన రూపం దృష్టిని ఆకర్షించి, మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>


