News May 11, 2024

ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఇదే(3/3)

image

లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీలో ఉన్నారు. విశాఖ లోక్‌సభలో అత్యధికంగా 33 మంది, రాజమండ్రిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీకి అత్యధికంగా 46 మంది, అత్యల్పంగా చోడవరం అసెంబ్లీకి ఆరుగురు పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో 79.84 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి 83 శాతం పోలింగ్‌ జరిగే అవకాశముందని అంచనా.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News February 7, 2026

ఈ 2 నెలలు దోమలతో జాగ్రత్త

image

ఫిబ్రవరి, మార్చి నెలల్లో దోమల బెడద మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు దోమలు గుడ్లు పెట్టగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగి వాటి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. దోమలు తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో అత్యంత చురుగ్గా ఉంటాయని, గాలిలో తేమ వల్ల కుడతాయని చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, కిటికీలు మూయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News February 7, 2026

చైనా సరికొత్త ఆయుధం.. శాటిలైట్లకు ముప్పు

image

భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపవర్‌ మైక్రోవేవ్‌ వెపన్‌ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గిగావాట్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ వంటి లో-ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది. ట్రక్కులు, షిప్‌లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్‌పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.