News February 7, 2025
మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ: శోభిత

‘తండేల్’ రిలీజ్ సందర్భంగా నాగచైతన్య సతీమణి శోభిత మూవీ టీమ్‌కు విషెస్ తెలిపారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి సారించారని, చేస్తున్నన్ని రోజులు పాజిటివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అంటూ చైతూను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ మూవీ కోసం చాలా రోజులుగా ఆయన గడ్డం లుక్‌లోనే ఉన్నారు. గత ఏడాది dec 4న వీరి వివాహమైన సంగతి తెలిసిందే.
Similar News
News March 16, 2025
నేడు మాస్టర్స్ లీగ్ ఫైనల్

వివిధ దేశాల దిగ్గజ విశ్రాంత క్రికెటర్లు ఆడుతున్న మాస్టర్స్ లీగ్ తుది దశకు చేరుకుంది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియాకు సచిన్, విండీస్‌కు లారా కెప్టెన్లుగా ఉన్నారు. గ్రూప్ దశలో ఐదింట నాలుగు గెలిచిన భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటు సచిన్, యువీ.. అటు సిమన్స్, డ్వేన్ స్మిత్ మెరుపులు మెరిపిస్తుండటంతో ఫైనల్ ఆసక్తికరంగా మారింది.
News March 16, 2025
ఫ్రాంచైజీ క్రికెట్ రారాజు ముంబై

ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో ముంబై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. 2011 CLT20 టైటిల్‌తో మొదలైన కప్పుల వేట నిరంతరాయంగా కొనసాగుతోంది. IPLలో 5టైటిళ్లు గెలుచుకొని చెన్నైతో పాటు టాప్ ప్లేస్‌లో ఉంది. నిన్నజరిగిన WPL ఫైనల్‌లోనూ విజయం సాధించింది. మెుత్తంగా అన్ని క్రికెట్ లీగ్‌లలో కలిపి 12 టైటిళ్లు గెలిచింది. ఈ విజయాలతో ఫ్రాంచైజీ క్రికెట్‌లో నంబర్‌వన్ జట్టుగా సత్తా చాటుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.
News March 16, 2025
రేపటి నుంచే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

TG: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. OBMMS ఆన్‌లైన్ పోర్టల్‌లో ఏప్రిల్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద SC, ST, BCలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ₹3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. 60%-80% వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి ₹6వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. వివరాలకు http//tgobmms.cgg.gov.in/ సంప్రదించండి.