News May 25, 2024
IPL చరిత్రలో ఇదే తొలిసారి

IPL ఫైనల్లో రేపు SRH, KKR జట్లు తలపడుతున్నాయి. IPL చరిత్రలో తొలిసారిగా అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఫైనల్లో సై అంటే సై అంటున్నారు. కమిన్స్‌ను SRH రూ.20.50 కోట్లకు సొంతం చేసుకోగా.. స్టార్క్‌ను KKR టీమ్ రూ.24.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. దీంతో IPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా వీరిద్దరు నిలిచారు. రేపటి భీకర పోరులో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News December 6, 2025
రీఫండ్ సరే.. మిస్ అయిన వాటి సంగతేంటి?

తల్లి మరణించినా వెళ్లలేని దుస్థితి.. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మిస్సైన టీమ్.. విదేశాల్లో జాబ్‌కు వెళ్తూ నిలిచిపోయిన యువకులు.. ప్రయాణాలు వాయిదా పడడంతో నష్టపోయిన కుటుంబాలు.. ఎయిర్‌పోర్టుల్లో వెయిట్ చేసి అనారోగ్యం బారినపడ్డ వృద్ధులు.. ఇలా ఎయిర్‌పోర్ట్‌ల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తున్న ఇండిగో తాము కోల్పోయిన వాటిని తీసుకురాగలదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
News December 6, 2025
బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలంటే?

బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తారు. అయితే భారతీయ మహిళల్లో రొమ్ములు చాలా దట్టంగా ఉండటం వల్ల.. ఈ పరీక్ష సమయంలో క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు మిస్ అవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే మహిళలు కూడా తమ రొమ్ములను ఎప్పటికప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.
News December 6, 2025
భారీ జీతంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


