News May 25, 2024

IPL చరిత్రలో ఇదే తొలిసారి

image

IPL ఫైనల్లో రేపు SRH, KKR జట్లు తలపడుతున్నాయి. IPL చరిత్రలో తొలిసారిగా అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఫైనల్లో సై అంటే సై అంటున్నారు. కమిన్స్‌ను SRH రూ.20.50 కోట్లకు సొంతం చేసుకోగా.. స్టార్క్‌ను KKR టీమ్ రూ.24.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. దీంతో IPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా వీరిద్దరు నిలిచారు. రేపటి భీకర పోరులో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News February 6, 2025

అందరి ముందు బట్టలు విప్పేసిన భార్యను సమర్థించిన భర్త

image

గ్రామీ అవార్డుల వేడుకలో అమెరికా స్టార్ సింగర్ కాన్యే వెస్ట్ భార్య బియాంకా సెన్సారి <<15346210>>నగ్నంగా<<>> కెమెరాలకు పోజులిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తన భార్య చేసిన ఘనకార్యాన్ని కాన్యే సమర్థించారు. తన భార్య స్మార్ట్, టాలెంటెడ్, బ్రేవ్ అని వెనకేసుకొచ్చారు. తమపై విమర్శలొచ్చినప్పటికీ ఆరోజు అత్యధికంగా గూగుల్‌లో శోధించిన వ్యక్తిగా సెన్సారి నిలిచిందన్నారు. ఇది గ్రామీ అవార్డులను సైతం ఓడించిందని భార్యను కొనియాడారు.

News February 6, 2025

డిగ్రీ అర్హతతో రూ.1.10 లక్షల జీతంతో ఉద్యోగాలు

image

224 పోస్టుల భర్తీకి AAI (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 5లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. జనరల్ అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. SC, STలకు వయసు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) చదివి ఉండాలి. నెలకు రూ.31,000-రూ.1,10,000 జీతం ఉండనుంది. aai.aero

News February 6, 2025

బీజేపీకి 45-55 సీట్లు: యాక్సిస్ మై ఇండియా

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. బీజేపీ 45-55, ఆప్ 15-25, కాంగ్రెస్ 0-1, ఇతరులు 0-1 సీట్లు గెలుస్తాయని పేర్కొంది. 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు అవసరం.

error: Content is protected !!