News August 5, 2024
అటు ప్రకృతి ప్రకోపం.. ఇటు దొంగల ప్రతాపం

ప్రకృతి విలయంతో విలవిల్లాడుతున్న వయనాడ్ ప్రజలకు కొత్తగా దొంగల బెడద పట్టుకుంది. వాలంటీర్ల రూపంలో దొంగలు చెలరేగిపోతున్నారని, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నారని బాధితులు వాపోతున్నారు. చూరల్మల, ముండక్కై గ్రామాల్లో కొండచరియలు విరిగిపడటంతో అధికారులు గ్రామస్థులను ఇళ్లు ఖాళీ చేయించి శిబిరాలకు తరలించారు. ఇదే అదనుగా కొందరు ఆ ఇళ్లను దోచుకుంటున్నారు. దీంతో వాలంటీర్లకు ఐడీ కార్డులు ఇవ్వడం ప్రారంభించారు.
Similar News
News November 24, 2025
‘తేజస్’ ప్రమాదంపై స్పందించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్

దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ <<18349994>>కూలిపోయిన<<>> ఘటనపై తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) స్పందించింది. ఇది అసాధారణ పరిస్థితుల వల్ల జరిగిన ఘటన అని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఈ ప్రమాదాన్ని విమానం పనితీరుకు ప్రతిబింబంగా చూడకూడదు. ఇది మా వ్యాపార కార్యకలాపాలు, భవిష్యత్తు డెలివరీలపై ఎలాంటి ప్రభావం చూపబోదు. దర్యాప్తుకు సహకరిస్తున్నాం’ అని తెలిపింది.
News November 24, 2025
BELOPలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<
News November 24, 2025
భారత్కు మరో ఓటమి తప్పదా?

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఓడిన టీమ్ఇండియా రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్సులో 201 పరుగులకే ఆలౌటై సఫారీలకు 288 రన్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అటు రేపు, ఎల్లుండి ఆట మిగిలి ఉండటంతో దూకుడుగా ఆడి <<18376327>>లీడ్<<>> పెంచుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది. రెండో ఇన్నింగ్సులోనూ భారత ప్లేయర్లు ఇదే ప్రదర్శన చేస్తే 0-2తో సిరీస్ను చేజార్చుకునే ప్రమాదముంది. దీంతో WTCలో స్థానం దిగజారనుంది.


