News November 17, 2024

ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ పరిశోధన!

image

97 ఏళ్లుగా కొనసాగుతూ ప్రపంచంలోనే సుదీర్ఘమైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన పరిశోధన ఇది. ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త థామస్ పార్నెల్ 1927లో ‘పిచ్ డ్రాప్’ అనే పరిశోధన ప్రారంభించారు. తారు నుంచి లభ్యమయ్యే ‘పిచ్’ ద్రవం అత్యంత చిక్కగా ఉంటుంది. దాని చిక్కదనాన్ని కొలిచేందుకు వేడి చేసి గరాటులో పోస్తే 97 ఏళ్లలో 9 చుక్కలే బయటికొచ్చాయి. గరాటు నుంచి మొత్తం పిచ్ ఖాళీ అయ్యేందుకు మరో వందేళ్లు పడుతుందని అంచనా.

Similar News

News November 17, 2024

కొత్త చిత్రంపై ప్రధాని మోదీ ప్రశంసలు

image

2002లో జరిగిన గోద్రా రైలు దుర్ఘటనకు దారితీసిన ప‌రిణామాల క‌థాంశంగా తెర‌కెక్కిన‌ ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని ప్రధాని మోదీ ప్ర‌శంసించారు. ఈ ఘ‌ట‌న చుట్టూ ఏర్ప‌డిన వివాదాన్ని కొట్టిపారేస్తూ చిత్రంలో నిజాల‌ను వెల్ల‌డించిన‌ందుకు అభినందించారు. న‌కిలీ క‌థ‌నాలు త‌క్కువ‌కాలం మాత్ర‌మే మ‌నుగ‌డ సాధించ‌గ‌ల‌వ‌ని వ్యాఖ్యానించారు. సామాన్యులు సైతం చూడదగిన పద్ధతిలో నిజాలు బయటకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.

News November 17, 2024

రేపటి నుంచి కొత్త పాలసీ.. వాటికి ట్యాక్స్ ఫ్రీ

image

TG: వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్రంలో ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ రేపటి(NOV 18) నుంచి 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. ఈ జీవో ప్రకారం ఈవీల్లో 4 వీలర్స్, టూవీలర్స్, కమర్షియల్ వెహికల్స్‌కు వందశాతం పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు.

News November 17, 2024

BUMRAH vs ASHWIN: ఎవరిదో ఆ రికార్డ్?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రాణిస్తే టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ముంగిట ఓ భారీ రికార్డు ఉంది. ఆసీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కపిల్ దేవ్ (51) పేరిట ఉంది. ప్రస్తుతం అశ్విన్ 39, బుమ్రా 32 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కపిల్ రికార్డును అధిగమించటానికి అశ్విన్‌కు 13, బుమ్రాకు 20 వికెట్లు అవసరం. ఒకవేళ BGT టూర్‌కు ఎంపికైతే షమీ(32)కీ ఈ ఛాన్స్ ఉంది.