News February 27, 2025

అత్యంత వివాదాస్పద చిత్రం ఇదే!

image

భారత సినీ పరిశ్రమలో ఎన్నో వివాదాస్పద సినిమాలున్నాయి. కానీ, పియర్ పాలో పసోలిని డైరెక్ట్ చేసిన ‘120 డేస్ ఆఫ్ సొదొమ్’ మాత్రం అత్యంత వివాదాస్పదమైంది. దీన్ని 150 దేశాలు బ్యాన్ చేశాయి. ఇది 1975లో ఇటాలియన్‌లో విడుదలైంది. వరల్డ్ వార్-2 నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజైన కొద్దిరోజులకే డైరెక్టర్‌ హత్యకు గురయ్యారు. కిడ్నాప్ చేసిన పిల్లలపై లైంగిక వేధింపులు, క్రూరంగా హింసించిన దృశ్యాలను ఇందులో చూపించారు.

Similar News

News March 27, 2025

బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తినండి

image

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అల్పాహారం తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. అధిక ప్రొటీన్ ఉండే చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తినాలి. రాగి, సామలు, కొర్రలతో చేసిన ఇడ్లీలు, దోశలు తింటే లాభాలు ఉన్నాయి. ఇవి తింటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. షుగర్, ఊబకాయం, రక్తహీనత, గుండె జబ్బుల నివారణకు ఇవి మంచి ఆహారం. అధిక ఆకలి సమస్యనూ అధిగమించవచ్చు.

News March 27, 2025

శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బంపరాఫర్?

image

ఈ నెల 29న గువాహటిలో బీసీసీఐ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని టాక్. కాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.

News March 27, 2025

జియో, ఎయిర్‌టెల్, Vi సిమ్‌లు వాడుతున్నారా?

image

టెలికాం కంపెనీలు తమ వినియోగదారుల కోసం త్వరలో ‘కాలర్ నేమ్ ప్రజెంటేషన్’ సదుపాయాన్ని తీసుకురానున్నాయి. ఇది ఆయా యూజర్లకు కాల్ చేసిన అవతలి వ్యక్తి పేరును ఫోన్ స్క్రీన్‌పై చూపిస్తుంది. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్‌ను అరికట్టేందుకు TRAI దీనిని గతంలోనే ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను అమలు చేసేందుకు Jio, Airtel, Vodafone-Idea(Vi) సిద్ధమయ్యాయి. KYC డాక్యుమెంట్ ఆధారంగా ఈ పేర్లను చూపించనున్నాయి.

error: Content is protected !!