News December 14, 2024
అల్లు అర్జున్ను అరెస్ట్ చేసింది ఈయనే..

TG: పుష్ప-2లో పుష్పరాజ్‌ను అరెస్ట్ చేసేందుకు SP షెకావత్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమవుతాడు. అది రీల్ స్టోరీ. కానీ రియల్ స్టోరీలో అల్లు అర్జున్ను ఓ సీఐ అరెస్ట్ చేశారు. ఆయనే బానోత్ రాజు నాయక్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బన్నీకి రాజు నాయక్ పెద్ద అభిమాని. అర్జున్‌తో ఒక్కసారైనా ఫొటో దిగాలని అనుకునేవారట. కానీ చివరికి తన అభిమాన నటుడినే అరెస్ట్ చేసే రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు!
Similar News
News February 4, 2026
మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం

TG: పంచాయతీ ఎన్నికల్లాగే.. మున్సిపల్ పోరులోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధించాలని మంత్రులతో CM రేవంత్ రెడ్డి అన్నారు. క్యాబినెట్ మంత్రులతో సమావేశమైన సీఎం, ఎలక్షన్లో ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. విజయంపై నివేదికలన్నీ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని, అయినా ఎన్నికలు పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంకా రెబల్స్ ఉంటే వారిని రాజీ చేయాలని, మంత్రులంతా జిల్లాలకు వెళ్లాలని సూచించారు.
News February 4, 2026
TODAY HEADLINES

* మా సహనమే గెలిపించింది.. USతో ట్రేడ్ డీల్‌పై మోదీ
* మోదీని బెదిరించి ట్రంప్ డీల్: రాహుల్
* రాహుల్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు: గోయల్
* మణిపుర్ CMగా ఖేంచంద్
* కల్తీ నెయ్యి కేసు.. విచారణ కమిషన్‌కు AP క్యాబినెట్ నిర్ణయం
* మద్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు: పవన్
* మోహన్ బాబు, విష్ణుపై కేసు
* TGకి 4.30 లక్షల ఇళ్లు: కిషన్ రెడ్డి
* 2L ఉద్యోగాలు ఎక్కడ: KTR
* TG: చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు
News February 4, 2026
మయన్మార్‌లో భూకంపం.. కోల్‌కతాలోనూ ప్రకంపనలు

మయన్మార్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.9గా నమోదైంది. భూకంప తీవ్రత వల్ల బంగ్లాదేశ్, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఇళ్లు, ఆఫీసులు స్వల్పంగా ఊగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. 71 గంటల్లో మయన్మార్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి.


