News December 14, 2024
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది ఈయనే..
TG: పుష్ప-2లో పుష్పరాజ్‌ను అరెస్ట్ చేసేందుకు SP షెకావత్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమవుతాడు. అది రీల్ స్టోరీ. కానీ రియల్ స్టోరీలో అల్లు అర్జున్‌ను ఓ సీఐ అరెస్ట్ చేశారు. ఆయనే బానోత్ రాజు నాయక్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బన్నీకి రాజు నాయక్ పెద్ద అభిమాని. అర్జున్‌తో ఒక్కసారైనా ఫొటో దిగాలని అనుకునేవారట. కానీ చివరికి తన అభిమాన నటుడినే అరెస్ట్ చేసే రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు!
Similar News
News January 17, 2025
సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు
దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీఖాన్‌ను అతడి పెద్ద కొడుకు ఇబ్రహీం హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే సైఫ్ వెంట ఏడేళ్ల కుమారుడు తైమూర్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఒళ్లంతా రక్తంతో ఉన్న వ్యక్తి చిన్న పిల్లాడితో కలిసి తన ఆటో ఎక్కాడని, ఆసుపత్రికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని అడిగారని డ్రైవర్ వెల్లడించారు. ఆ తర్వాతే తాను ఆయనను సైఫ్‌గా గుర్తుపట్టినట్లు అతడు చెప్పారు.
News January 17, 2025
ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే రాదు: కుమారస్వామి
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లోకి తేవడమే కేంద్రం లక్ష్యమని కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రానున్న రెండు, మూడేళ్లలో ప్లాంట్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా చేస్తామన్నారు. ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే రాదని స్పష్టం చేశారు. ఇవాళ ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీ మొదటిదేనని, భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సాయాల ప్రకటనలు చేస్తామని పేర్కొన్నారు.
News January 17, 2025
ప్రధాని మోదీకి ధన్యవాదాలు: లోకేశ్ హర్షం
స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రానికి గర్వకారణమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ప్రధాని మోదీ ఆమోదించిన రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అందించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్లాంట్‌కు పెద్దపీట వేసిన ప్రధాని మోదీకి ఈ క్రెడిట్ దక్కాలి. కేంద్రానికి ధన్యవాదాలు’ అని తెలిపారు.