News September 14, 2024
ట్రాన్స్‌జెండర్ల యూనిఫామ్స్ నమూనా ఇదే!
TG: హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ట్రాఫిక్ వాలంటీర్లుగా పని చేసే ట్రాన్స్‌జెండర్ల కోసం వేర్వేరు డిజైన్‌లతో విభిన్నమైన యూనిఫామ్స్ రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ మేరకు యూనిఫామ్స్‌కు సంబంధించిన నమూనాను రిలీజ్ చేసింది. ఈ వాలంటీర్లు నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారని ప్రభుత్వం చెప్పింది.
Similar News
News October 3, 2024
తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
AP: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లో సేనాధిపతి విశ్వక్సేనుల వారి ఉత్సవం వైభవంగా జరిపించారు. రేపు సాయంత్రం 5.45 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 8వ తేదీ గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.
News October 3, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలో రేపు ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
News October 3, 2024
11న మద్యం షాపుల కేటాయింపు: ఎక్సైజ్ శాఖ
AP: రాష్ట్రంలో లాబీయింగ్‌కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, 12 నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బార్‌ల లైసెన్స్ 2025 ఆగస్టు వరకు ఉండటంతో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.