News November 25, 2024
RCB జట్టు ఇదే..!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ ఈసారి ఆచితూచి వ్యవహరించింది. రిటెన్షన్లతో కలుపుకుని మొత్తం 22 మందిని కొనుగోలు చేసింది. జట్టు: కోహ్లీ, పటీదార్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లివింగ్ స్టోన్, రొమారియో షెఫర్డ్, నువాన్ తుషారా, యశ్ దయాల్, సుయాశ్ శర్మ, జితేశ్ శర్మ, భువనేశ్వర్, కృనాల్ పాండ్య, జోస్ హేజిల్ వుడ్, రసిక్ దార్, స్వప్నిల్ సింగ్, భండాగే, బేథేల్, పడిక్కల్, ఎంగిడి, చికారా, అభినందన్, రాతే,
Similar News
News December 2, 2024
ప్లాస్టిక్‌ను తినేసే పురుగులు.. పర్యావరణ రక్షకులు
పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్‌ను భూమి నుంచి త్వరగా నిర్మూలించేందుకు కెన్యా మీల్‌వార్మ్ అనే పురుగులు సాయపడతాయని న్యూయార్క్ సైంటిస్టులు వెల్లడించారు. వీటిలో పాలీస్టైరిన్‌ను విచ్ఛిన్నం చేయగల ఎంజైమ్‌లు ఉంటాయని, వేగంగా జీర్ణం చేసుకోగలవని తెలిపారు. ఈ పురుగులపై మరింత అధ్యయనం చేయడం ద్వారా సమర్థవంతంగా ప్లాస్టిక్‌ను వదిలించుకోవచ్చని పేర్కొన్నారు. పైగా ఇవి ఎక్కువ కాలం జీవిస్తాయని చెప్పారు.
News December 2, 2024
‘ది సబర్మతి రిపోర్ట్’ వీక్షించనున్న మోదీ
ప్రధాని మోదీ ఇవాళ ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను వీక్షించనున్నారు. పార్లమెంట్ హాల్‌లోని బాలయోగి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు మూవీని ప్రదర్శించనున్నారు. గోద్రా అల్లర్ల ఘటన కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, రిధి డోగ్రా, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు.
News December 2, 2024
ఇళ్ల ధరల్లో పెరుగుదల ఇలా!
ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో గతేడాది నుంచి జరిగిన హెచ్చుతగ్గులను TNIE నివేదించింది. హౌసింగ్ ధరలు చదరపు గజానికి సగటున రూ.11వేలు ఉన్నట్లు తేలింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, పుణే, ముంబైలలో 2023 Q3 నుంచి 2024 Q4 వరకు ఇళ్ల ధరలను పరిశీలించారు. HYDలో స్క్వేర్ ఫీట్‌కు రూ.11,040 నుంచి ఇప్పుడు రూ.11,351కి పెరిగింది. ఇక్కడ 3శాతం వృద్ధిరేటు కనిపించింది.