News September 2, 2024

విజయవాడ మునకకు కారణం ఇదే!

image

AP: ఎన్నడూ లేనంత భారీ వర్షాలకు విజయవాడ మునిగిపోయింది. ఒకప్పుడు వాన నీరు ప్రవహించే బుడమేరు కాలువ నగరీకరణ కారణంగా మురికినీరు, చెత్తాచెదారంతో నిండిపోయింది. పైగా నగరంలోని అవుట్‌ఫాల్ డ్రెయిన్లు బుడమేరులోనే కలుస్తున్నాయి. ఊహించని రీతిలో వరద రావడంతో ఆ కాల్వ ఉప్పొంగిపోయింది. దీంతో విజయవాడ జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది.

Similar News

News March 8, 2025

MLA సబితకు అనారోగ్యం

image

TG: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో జరిగిన మీటింగ్‌లో పాల్గొన్నారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేశాక ఆమె అస్వస్థతకు గురయ్యారు. సబిత జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు.

News March 8, 2025

రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం

image

AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న(85) <<15683370>>మృతిపై<<>> భార్య అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు రీపోస్టుమార్టం నిర్వహించారు. తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ఆయన శరీరంపై గాయాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కాగా ఆయన మృతిపై సీఎం చంద్రబాబు, కడప ఎస్పీ, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి కూడా అనుమానాలు లేవనెత్తిన విషయం తెలిసిందే.

News March 8, 2025

నటుడు మృతి.. కారణం ఇదే

image

హాలీవుడ్ నటుడు హాక్‌మన్, అతని భార్య అమెరికాలోని ఇంట్లో అనుమానాస్పద స్థితిలో <<15598233>>చనిపోయిన <<>>సంగతి తెలిసిందే. వారి మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో అతడు గుండె జబ్బు, అల్జీమర్స్‌తో చనిపోయినట్లు తేలింది. అతని భార్య హాంటావైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించిందని గుర్తించారు. అటు భార్య అనారోగ్యంతో వారం క్రితం మృతి చెందిన విషయం హాక్‌మన్‌కు తెలియదని సమాచారం.

error: Content is protected !!