News December 5, 2024
ఈ రోజు స్టాక్ మార్కెట్ల లాభాలకు కారణం ఇదే!

రెపోరేటును RBI 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తుందన్న ఊహాగానాలతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడినట్టు తెలుస్తోంది. RBI ద్రవ్య విధాన కమిటీ సమావేశం Wed ప్రారంభమైంది. సమావేశ వివరాలను శుక్రవారం వెల్లడిస్తారు. ఆర్థిక రంగానికి బూస్ట్ ఇచ్చేలా RBI వడ్డీ రేట్లలో కోత విధిస్తుందని ఇన్వెస్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో IT, బ్యాంకు, ఫైనాన్స్ రంగ షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు.
Similar News
News February 11, 2026
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారా?

TG: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మార్చి 1 నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు HYD పోలీసులు తెలిపారు. DL లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదని పేర్కొన్నారు. లైసెన్స్ లేనివారు RTA కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచించారు.
* మైనర్లకు వాహనం ఇవ్వకపోవడం ఉత్తమం.
News February 11, 2026
అయ్యప్ప దీక్షతో ఆరోగ్య రహస్యాలు

అయ్యప్ప దీక్ష ఆత్మస్థైర్యానికి శిక్షణ. సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. క్షవరం చేయకపోవడం దేహంపై మోహాన్ని తగ్గించి, చలి నుంచి రక్షణనిస్తుంది. వేడిని గ్రహించే నలుపు వస్త్రాలు వైరాగ్యానికి ప్రతీకలు. పాదరక్షలు విడిస్తే కష్టాలు తట్టుకునే కఠినత్వం అలవడుతుంది. ఇలా ప్రతి నియమం భక్తుడిని శారీరక దృఢత్వం, ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపిస్తుంది.
News February 11, 2026
అసెంబ్లీ సమావేశాలకు జగన్.. ‘వార్’ తప్పదా?

AP: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇవాళ బడ్జెట్‌పై గవర్నర్ ప్రసంగించనున్న నేపథ్యంలో YCP చీఫ్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు, MLCలు హాజరవుతారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. గత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత జగన్ సభ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈసారీ పూర్తిగా హాజరవడం అనుమానమే. ఒకవేళ హాజరైతే కల్తీ నెయ్యి అంశంపై కూటమి, YCP నేతల మధ్య వార్ ఖాయంగా కనిపిస్తోంది.


