News November 6, 2024

ఇదీ ట్రంప్ ప్రస్థానం!

image

1959: 13 ఏళ్ల వయసులో న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో చేరిక
1964-68: పెన్సిల్‌వేనియా వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో BSc
1968: తండ్రికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలో కొలువు
1991-2009: ఆరు ఆస్తులు దివాళా తీసినట్లు ప్రకటన
2016: అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ఎన్నిక
2023: జైల్లో ఫొటో తీయించుకున్న తొలి అధ్యక్షుడిగా మచ్చ
2024: రెండు హత్యాయత్నాలు-తప్పిన ప్రమాదం, 47వ అధ్యక్షుడిగా ఎన్నిక

Similar News

News December 14, 2024

ఉద్దేశపూర్వకంగానే జైల్లో ఉంచారు: బన్నీ లాయర్లు

image

అల్లు అర్జున్‌ను రాత్రంతా జైల్లోనే ఉంచడంపై ఆయన తరఫు లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టం చేసినా జైలు అధికారులు పట్టించుకోలేదంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే బన్నీని జైల్లో ఉంచారని, ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని చెబుతున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లే విషయమై అర్జున్ గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌లో సినీ ప్రముఖులు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

News December 14, 2024

BITCOIN: ఒకరోజు లాభం Rs 1.20లక్షలు

image

క్రిప్టో మార్కెట్లు నిన్న అదరగొట్టాయి. దాదాపుగా టాప్ కాయిన్లన్నీ లాభాల పంట పండించాయి. బిట్‌కాయిన్ $1419 (Rs 1.20L) మేర పెరిగింది. $99,205 వద్ద కనిష్ఠ, $1,01,895 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి $1,01,424 వద్ద ముగిసింది. నేడు అదే స్థాయి వద్ద మొదలై $505 లాభంతో $1,01,973 వద్ద ట్రేడవుతోంది. నిన్న ETH 0.61, XRP 3.87, BNP 2.94, DOGE 1.28, ADA 1.02, AVAX 2.26, LINK 2.10, SHIB 1.93% మేర లాభపడ్డాయి.

News December 14, 2024

అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది ఈయనే..

image

TG: పుష్ప-2లో పుష్పరాజ్‌ను అరెస్ట్ చేసేందుకు SP షెకావత్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమవుతాడు. అది రీల్ స్టోరీ. కానీ రియల్ స్టోరీలో అల్లు అర్జున్‌ను ఓ సీఐ అరెస్ట్ చేశారు. ఆయనే బానోత్ రాజు నాయక్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బన్నీకి రాజు నాయక్ పెద్ద అభిమాని. అర్జున్‌తో ఒక్కసారైనా ఫొటో దిగాలని అనుకునేవారట. కానీ చివరికి తన అభిమాన నటుడినే అరెస్ట్ చేసే రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు!