News March 30, 2024

KCR పర్యటన షెడ్యూల్ ఇదే..

image

ఎండిన పంటలను పరిశీలించేందుకు BRS అధినేత KCR రేపట్నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉ.8:30గంటలకు ఎర్రవల్లి నుంచి బయలుదేరుతారు. 10:30కు ధ‌రావ‌త్ తండాకు(జ‌న‌గామ), 11:30కి తుంగ‌తుర్తి, అర్వ‌ప‌ల్లి, సూర్యాపేట రూర‌ల్ మండ‌లాలు(సూర్యాపేట), మ.2గంటలకు సూర్యాపేట MLA ఆఫీసులో భోజనం, 3గంట‌ల‌కు ప్రెస్ కాన్ఫ‌రెన్స్, సా.4:30లకు నిడ‌మ‌నూరు మండ‌లం, సా.6గంటలకు ఎర్ర‌వల్లికి బ‌య‌ల్దేర‌తారు.

Similar News

News January 22, 2025

నిజమైన ప్రేమ దొరకడం కష్టమే: చాహల్

image

తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల రూమర్ల నేపథ్యంలో టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు. ‘నిజమైన ప్రేమ చాలా అరుదు.. నా పేరు కూడా అలాంటిదే’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్, పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి చాహల్‌ను ఎంపిక చేయలేదు. దీంతో BCCIపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.

News January 22, 2025

దావోస్‌లో టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ దావోస్‌లో భేటీ అయ్యారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో టీమ్ ఇండియా’ అంటూ ఈ ఫొటోను చంద్రబాబు Xలో పోస్ట్ చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, ఏఐ, ఉద్యోగాలు వంటి అనేక అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం.

News January 22, 2025

విజయ పరంపర కొనసాగుతుందా?

image

ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఇప్పటికే జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి 4 టీ20 సిరీస్‌లలో ఇండియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ సిరీస్ కూడా గెలుపొంది వరుసగా 5 టీ20 సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టిస్తుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కోహ్లీ కెప్టెన్‌గా మూడు సార్లు గెలిస్తే రోహిత్ సారథ్యంలో ఇండియా ఒకసారి గెలిచింది.