News March 8, 2025

ఇవాళ ఇంటర్ పరీక్షకు ఎంపిక చేసిన సెట్ ఇదే

image

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే ఫస్టియర్ మ్యాథ్స్ 1B ఎగ్జామ్‌కు సెట్-3 ప్రశ్నపత్రాన్ని విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయి.
* విద్యార్థులందరికీ ALL THE BEST

Similar News

News April 4, 2026

ఒరాకిల్ బాస్‌కు ₹18 లక్షల కోట్ల లాస్

image

ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎలిసన్ గత 6 నెలల్లో ఊహించని రీతిలో నష్టపోయారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆయన $393 బిలియన్లతో సంపద విషయంలో మస్క్‌నే వెనక్కి నెట్టారు. కానీ ఇప్పుడు ఆయన నెట్ వర్త్ $195 బిలియన్లకు పడిపోయింది. దాదాపు ₹18 లక్షల కోట్లు నష్టపోయారు. ఒరాకిల్ షేరు విలువ 50% పైగా కుప్పకూలడమే ఇందుకు కారణం. ఏకంగా 50% సంపద కోల్పోవడం గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద ‘డౌన్‌ఫాల్’ అని నిపుణులు అంటున్నారు.

News April 4, 2026

పంజాబ్ విజయం.. గర్వంగా ఉందన్న ప్రీతి జింటా

image

చెన్నైపై పంజాబ్ జట్టు అద్భుత విజయం సాధించడం పట్ల యజమాని ప్రీతి జింటా సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణంలో ఉండటం వల్ల మ్యాచ్ చూడలేకపోయానని పేర్కొన్నారు. అయితే 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన తీరు గర్వంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, కూపర్ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించారు. జట్టు సమష్టి కృషితోనే ఈ విజయం దక్కిందని కొనియాడుతూ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.

News April 4, 2026

IPL చరిత్రలో చెన్నై సరికొత్త రికార్డ్

image

IPL హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పంజాబ్ కింగ్స్ (PBKS)పై శుక్రవారం చేసిన 209 పరుగులతో కీలక మైల్‌స్టోన్‌ను అందుకుంది. ఇప్పటివరకు ఏకంగా 36 సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించి అత్యధిక సార్లు ఈ ఫీట్‌ను అందుకున్న టీమ్‌గా నిలిచింది. తర్వాత స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (35 సార్లు) ఉంది. 2010లో రాజస్థాన్‌పై చేసిన 246 పరుగులు ఇప్పటి వరకు చెన్నైకి హయ్యెస్ట్ స్కోర్‌.