News March 8, 2025
ఇవాళ ఇంటర్ పరీక్షకు ఎంపిక చేసిన సెట్ ఇదే

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే ఫస్టియర్ మ్యాథ్స్ 1B ఎగ్జామ్‌కు సెట్-3 ప్రశ్నపత్రాన్ని విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయి.
* విద్యార్థులందరికీ ALL THE BEST
Similar News
News February 12, 2026
లో దుస్తుల్ని ఎలా ఎంచుకోవాలంటే?

మనం నిత్యం ధరించే లోదుస్తుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ బిగుతుగా కాకుండా సరైన సైజ్ లోదుస్తులే వాడాలి. సింథటిక్, నాన్ బ్రీతబుల్ మెటీరియల్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇవి చెమటలను పీల్చుకోకపోగా బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతాయంటున్నారు. అలాగే మరీ లూజ్‌గా ఉన్నవి వేసుకున్నా అసౌకర్యంగా ఉండటంతో పాటు మెడ, భుజాల నొప్పికి కూడా దారితీస్తాయంటున్నారు.
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘భోళాశంకరుడు’’

శివుడు సులభప్రసన్నుడు. ఆయనను మెప్పించడానికి భారీ కానుకలు, పెద్ద పూజలు అవసరం లేదు. స్వచ్ఛమైన మనసుతో చిన్న బిల్వ పత్రం సమర్పించినా, గుక్కెడు నీళ్లతో అభిషేకం చేసినా ఆయన పరవశించిపోతాడు. భక్తుడు తన కష్టాలను చెప్పుకుంటే చాలు.. ఏ మాత్రం ఆలోచించకుండా అడిగిన వరాలను ఇచ్చేస్తాడు. అందుకే భక్తులు ఆయనను అమాయకుడైన దేవుడిగా, ప్రేమగా ‘భోళాశంకరుడు’ అని పిలుచుకుంటారు. హృదయ శుద్ధి మాత్రమే ఆయన కోరుకునే ఏకైక దక్షిణ.
News February 12, 2026
హగ్ డే స్పెషల్.. CSK నుంచి స్పెషల్ పోస్ట్

నేడు ‘హగ్ డే’ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ మైదానంలోని మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ, స్మృతి- హర్మన్, ధోనీ- జడేజా, టెండూల్కర్-ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్లు కౌగిలించుకున్న అరుదైన చిత్రాలను CSK తన X ఖాతాలో పంచుకుంది. గెలుపు సమయంలో పొంగివచ్చే సంతోషాన్ని ఈ ఫొటోలు ప్రతిబింబిస్తున్నాయి.


