News April 25, 2024
‘ముస్లిం కోటా’ స్టోరీ ఇదే – 2/3

2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్లీ ఈ ప్రతిపాదన వచ్చింది. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా ఈ కోటా 4%కు తగ్గించాలని సూచించింది. 2010 మార్చి 25న ఈ 4% కోటా అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు ఆ 14 వర్గాలను EBC పరిధిలోకి తేవాలని ఆదేశించింది. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ రెండోసారి గెలిచాక 2011లో మైనార్టీలకు ఓబీసీలో 8.4% సబ్ కోటా (ముస్లింలకు 6%) కల్పిస్తామని ప్రతిపాదించింది. <<-se>>#Elections2024<<>>
Similar News
News January 6, 2026
BREAKING: విజయ్‌కు సీబీఐ నోటీసులు

తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, స్టార్ హీరో విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.
News January 6, 2026
రాష్ట్రంలో 424 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 6, 2026
సక్సెస్‌తో వచ్చే కిక్కే వేరు: CBN

AP: 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లోనూ ముందుకెళ్లాలని CM CBN SIPB సమావేశంలో సూచించారు. ‘టాటా, జిందాల్, బిర్లా, ADANI, RIL,TCS, కాగ్నిజెంట్ వంటివి పెట్టుబడులు పెడుతున్నాయి. గ్రౌండింగ్‌లో పొరపాట్లకు తావుండొద్దు. 2029కి విద్యుత్ కొనుగోలు ఛార్జీ ₹3.70కి తగ్గేలా చేద్దాం’ అని పేర్కొన్నారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని, దాని కోసం అందరూ పని చేయాలని వ్యాఖ్యానించారు.


