News August 10, 2024
NDAకి ఇది మూడోసారి..!
గత పదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులపై విపక్షాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న సందర్భాలు తక్కువ! కానీ మూడు అంశాల్లో కేంద్రం వెనక్కి తగ్గిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. గతంలో భూసేకరణ చట్టం, సాగు చట్టాల విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం తాజాగా వక్ఫ్ సవరణ బిల్లును మాత్రమే JPCకి పంపిన సంగతి తెలిసిందే.
Similar News
News January 18, 2025
సంజయ్‌ను ఉరి తీయండి: ప్రజల నినాదాలు
అభయ హత్యాచార కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌ను ఉరి తీయాలని కోర్టు బయట మెడిసిన్ విద్యార్థులు, ప్రజలు నినాదాలు చేశారు. ఇలా అయితేనే మరొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడేందుకు భయపడతారని అన్నారు. కాగా కేసు తీవ్రత దృష్ట్యా ఈ మధ్యాహ్నం భారీ బందోబస్తు మధ్య రాయ్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. ప్రత్యేక బృందాలతో పాటు 300 మందికి పైగా పోలీసులు కోర్టు చుట్టూ మోహరించారు.
News January 18, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు.
టీమ్: రోహిత్ శర్మ (C), గిల్(VC), జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్.
News January 18, 2025
నేను నేరం చేయలేదు: కోర్టులో సంజయ్
కోల్‌కతా హత్యాచార ఘటనలో దోషిగా కోర్టు నిర్ధారించిన <<14530358>>సంజయ్ రాయ్<<>> తాను నిర్దోషిని అని వాదించాడు. ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించే ముందు జడ్జితో ‘నేను ఈ నేరం చేయలేదు’ అని చెప్పాడు. గతంలో కూడా ఇతడు ఇదే తరహా కామెంట్లు చేశాడు. అటు అతడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని రాయ్ కుటుంబం పేర్కొంది. కోల్‌కతాలోని శంభునాథ్ స్లమ్‌లో ఒక గదిలో ఉండే వీరి కుటుంబం.. పోరాడే శక్తి సైతం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేసింది.