News April 18, 2024
వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్ ఇదే
గాజా-ఇజ్రాయెల్ పోరు ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. గత ఏడాది అక్టోబర్‌లో పాలస్తీనియన్ ఎన్‌క్లేవ్‌పై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో చాలా మంది మరణించారు. దాడి అనంతరం ఓ ఆస్పత్రి మార్చురీలో రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ మహ్మద్ సలేం తీసిన ఫొటో ఇప్పుడు వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఓ మహిళ తన ఐదేళ్ల మేనకోడలి మృతదేహాన్ని పట్టుకుని రోదిస్తుండగా ఈ ఫొటోను తీశారు.
Similar News
News September 10, 2024
బీసీ కులగణనపై హైకోర్టు కీలక ఆదేశాలు
TG: మూడు నెలల్లో బీసీ కులగణన పూర్తిచేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణన చెయ్యాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం మూడు నెలల్లో కులగణన పూర్తిచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.
News September 10, 2024
16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వాడొద్దన్న AUS ప్రభుత్వం!
సోషల్‌మీడియా వినియోగం పిల్లలను తప్పుదారి పట్టిస్తోందని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం 16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వినియోగించకుండా నిషేధం విధించనుంది. మొబైల్‌కే పరిమితం కాకుండా పిల్లలు మైదానంలోకి వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పీఎం వెల్లడించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టిక్‌టాక్ తదితర యాప్స్‌ను పిల్లలు వాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
News September 10, 2024
గ్లోబల్ స్టేజ్‌పై భారత్‌ను విస్మరించలేరు: కాంగ్రెస్ ఎంపీ
ప్రపంచ ఆర్థిక, రాజకీయాల్లో అత్యంత కీలకమైన భారత్‌ను విస్మరించరాదని, అలాగే తక్కువ అంచనా వేయలేరని కాంగ్రెస్ MP శశి థరూర్ స్పష్టం చేశారు. ‘వేగంగా పెరుగుతున్న జనాభా, ఎకానమీ అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ను అత్యంత కీలకంగా మార్చేశాయి. జియో పాలిటిక్స్‌లో చైనా, పాక్, USతో సవాళ్లు ఎదురవుతున్నా సమతూకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం భారత్ తీసుకొనే నిర్ణయాలు ప్రపంచంపై సుదీర్ఘకాలం ప్రభావం చూపిస్తాయి’ అని అన్నారు.