News April 29, 2024
తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఇదే: కాంగ్రెస్

TG: రాష్ట్రానికి బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా పెద్ద గుడ్డును గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసింది. తెలంగాణ అడిగినవి ఇవి అంటూ ‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మేడారం సమ్మక్క-సారలక్క జాతరకు జాతీయ హోదా, బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా’ వంటి పలు అంశాలతో ఫ్లెక్సీని ప్రదర్శించింది. చివరికి బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అంటూ ఓ పెద్ద గుడ్డును పెట్టింది.
Similar News
News January 21, 2026
భూముల మార్కెట్ విలువలు పెంపు!

AP: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భూముల <<13263246>>మార్కెట్ విలువలు<<>> పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి సవరించిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలోనూ అన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెంచింది. <<7981895>>గతేడాది<<>> కొత్త జిల్లా కేంద్రాలు, వాణిజ్య ప్రాంతాల్లో 15-25% పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి నవంబర్ వరకు ₹7 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఎంత మేర పెంచుతారనే దానిపై త్వరలో క్లారిటీ రానుంది.
News January 21, 2026
రాష్ట్రంలో 220 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ (MD/MS/DNB/DrNB/DM/MCh) ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.68,900-రూ.2,05,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://apchfw.ap.gov.in * మరిన్ని ఉద్యోగాల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 21, 2026
ప్రతి ఏడాది ఫాలో అప్ సదస్సు పెట్టండి.. CM ప్రతిపాదన

TG: ప్రతి జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని CM రేవంత్ దావోస్‌లో ప్రతిపాదించారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని.. అందుకే ప్రతి ఏడాది జులై/AUGలో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని WEF ప్రతినిధులకు సూచించారు. ఇటీవల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని సీఎం గుర్తు చేశారు.


