News February 4, 2025
ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే జరిగేది ఇదే!
KBCలో రూ.5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ గుర్తున్నాడా? 2011లో ఈయన విజయం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. కానీ, ఆయన విజయం కొన్ని రోజుల్లోనే విషాదంగా మారింది. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ఆయన రోడ్డునపడ్డారు. అడిగిన వారికి డబ్బు ఇచ్చేయడం, ఆలోచించకుండా బిజినెస్ పెట్టి మొత్తం లాస్ అయ్యాడు. దీంతో భార్యతో తరచూ వాదనలు పెట్టుకొని ఆమెతోనూ విడిపోయాడు. మళ్లీ చదువుకొని ప్రస్తుతం టీచర్‌గా మారారు.
Similar News
News February 5, 2025
కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం
TG: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రేపటి నుంచి పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో భానుడి భగభగలు తప్పవని హెచ్చరించింది. వృద్ధులు, చిన్నారులు, మహిళలు బయటకి వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఈ మూడ్రోజులు కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News February 5, 2025
నా మందు ఇండియన్లు తాగటం లేదు: పాంటింగ్
తన కంపెనీ ‘పాంటింగ్ వైన్స్’పై భారతీయులు ఆసక్తి చూపడం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నారు. ఇండియాలో తన బ్రాండ్‌ను పంపిణీ చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ‘ఢిల్లీలో నా కంపెనీ మద్యం బాగానే అమ్ముడవుతోంది. ఇప్పుడిప్పుడే దేశమంతా విస్తరించేలా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ పన్నులు, టారిఫ్‌లు సవాళ్లుగా మారాయి’ అని ఆయన పేర్కొన్నారు. IPLలో పాంటింగ్ PBKS హెడ్ కోచ్‌గా ఉన్నారు.
News February 4, 2025
రేపే పోలింగ్.. అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు
రేపు ఢిల్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదైంది. యమునా నదిని హరియాణా విషపూరితంగా మారుస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరుల మనోభావాలు దెబ్బతీశారని, ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారని FIRలో పేర్కొన్నారు.