News December 5, 2024
శాపం వరంగా మారడమంటే ఇదే..

సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకోవడమంటే ఇదే. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల రష్యాపై వెస్ట్రన్ కంట్రీస్ ఎడాపెడా ఆంక్షలు విధించాయి. విచిత్రంగా FMCG, IT, ఫైనాన్స్ సహా అన్ని MNCలు వెళ్లిపోయాయి. ఇప్పుడదే రష్యాకు వరంగా మారింది. వెళ్లిపోయిన వాటి స్థానంలో స్థానిక బ్రాండ్లు దుమ్మురేపుతున్నాయి. మార్కెట్ మొత్తం కైవసం చేసుకున్నాయి. లాభాల పంట పండిస్తున్నాయి. దీంతో నాశనం అవుతుందనుకున్న అక్కడి ఎకానమీ పరుగులు పెడుతోంది.
Similar News
News December 9, 2025
HYD: ప్చ్.. ఈ సమ్మర్లో బీచ్ కష్టమే!

రూ.225 కోట్లతో 35 ఎకరాల్లో కొత్వాల్‌గూడలో మొట్టమొదటి కృత్రిమ బీచ్ ప్రతిపాదన ఈ వేసవికి కూడా కలగానే మిగిలేలా ఉంది. వేవ్ టెక్నాలజీతో కూడిన మ్యాన్‌మేడ్ సరస్సు, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, అడ్వెంచర్స్, థియేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. రూ.15,000 కోట్ల పర్యాటక సామర్థ్యాన్ని పెంచేలా DEC నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, వచ్చే ఏడాది మార్చిలోనే పనులు ప్రారంభంకానున్నట్లు సమాచారం.
News December 9, 2025
మార్కెట్‌పై Blanket కోసం blinkIt డేంజర్ మూవ్

క్విక్ కామర్స్ మార్కెట్‌పై పాగా వేసేందుకు blinkIt మెడిసిన్ డెలివరీ చేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయకున్నా Order And Approve పద్ధతిలో ఆర్డర్ ప్లేస్ అవుతుంది. కస్టమర్‌కు కాసేపటికి డాక్టర్ అని కాల్ చేసి మెడిసిన్ వివరాలు, అవసరం అడిగి అప్రూవ్ చేస్తున్నారు. జలుబు, జ్వరం మందులే కాదు.. బీపీ, షుగర్, నరాల సమస్యల మెడిసిన్స్ సైతం ఓ కాల్‌తో ఇచ్చేస్తున్నారు.
News December 9, 2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్‌లో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్‌లో 14 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ(ఫిజిక్స్, మ్యాథ్స్, జియోఫిజిక్స్,జియాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 15లోపు దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్సైట్: https://iigm.res.in/


