News March 27, 2025

శరీరంపై ఎక్కువ బ్యాక్టీరియాలు ఉండేది ఇక్కడే..

image

జననాంగాల్లో బ్యాక్టీరియా ఎక్కువని అంతా అనుకుంటాం. కానీ వాటికంటే అధికంగా క్రిములుండే భాగాలున్నాయి. నోటిలోని పళ్లు, నాలుక తదితర భాగాలతో పాటు నాభి/బొడ్డు, చంకలూ వేల బ్యాక్టీరియాలకు ఆవాసాలు. అటు గాలితో పాటు ముక్కులోకి వేల సంఖ్యలో ఇవి చేరుతాయి. ముక్కు రంధ్రాల్లో వేలు పెడితే వేళ్లకూ అంటుతాయి. ఇక గోర్లలో (ముఖ్యంగా చేతుల) వేల కొద్దీ బ్యాక్టీరియాలుంటాయి. వీలైనంత శుభ్రంగా ఉండటమే వీటిని పారదోలే మార్గం.

Similar News

News November 22, 2025

రోడ్డు ప్రమాదంలో సింగర్ మృతి

image

ఘోర రోడ్డు ప్రమాదంలో పంజాబీ సింగర్ హర్మన్ సిద్ధూ(37) మృతి చెందారు. మాన్సా-పాటియాలా రోడ్డులో వెళ్తుండగా ఆయన కారు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో హర్మన్ అక్కడికిక్కడే మరణించారు. బేబే బాపు, బబ్బర్ షేర్, కోయ్ చక్కర్ నై, ముల్తాన్ వర్సెస్ రష్యా తదితర సాంగ్స్‌తో ఆయన పాపులర్ అయ్యారు. హర్మన్ మృతితో అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

News November 22, 2025

కార్ల వేలానికి ఓకే.. నీరవ్ ‌మోదీకి సీబీఐ కోర్టు షాక్

image

బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి సీబీఐ కోర్టు షాకిచ్చింది. ఆయనకు సంబంధించి ఈడీ సీజ్ చేసిన 2 కార్లను వేలం వేయడానికి స్పెషల్ జడ్జి జస్టిస్ ఏవీ గుజ్‌రాతీ అనుమతించారు. బెంజ్ GLE250 (39 లక్షలు), స్కోడా సూపర్బ్ ఎలిగెన్స్‌ (7.5 లక్షలు) కార్లు వేలం వేసి డబ్బును నేషనలైజ్డ్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలన్నారు. సీజ్ చేసిన 3 కార్ల వేలానికి అనుమతి కోరగా రెండింటికే అంగీకరించింది.

News November 22, 2025

మహిళలు గంధం రాసుకునేది ఎందుకంటే?

image

ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చుట్టాలతో, పెద్దవారితో ఆప్యాయంగా, వినయంగా మాట్లాడాల్సిన బాధ్యత ఇల్లాలుపై ఉంటుంది. అయితే కొందరు మహిళల మాటతీరు గట్టిగా ఉంటుంది. శుభకార్యాలప్పుడు అతిథులు ఈ మాటతీరును ఇబ్బందిగా భావిస్తారు. అందుకే గొంతుపై గంధం రాస్తారు. ఇలా రాస్తే గొంతు సరళంగా, సున్నితంగా మారి మాటతీరు తియ్యగా, వినస్రవ్యంగా మారుతుందని నమ్మేవారు. స్త్రీ రూపానికి తగిన మృదువైన స్వరం ఉండాలని ఇలా చేశారు.